logo

సహ చట్టాన్ని పక్కదారి పట్టిస్తున్న రెవెన్యూ శాఖ ఏం అడిగినా సమాచారం లేదంటూ తప్పించుకుంటున్న ఇల్లందు రెవెన్యూ శాఖ

ఇల్లందు అక్టోబర్ 16 AIMA మీడియా)
ఇల్లందు మండల తహసిల్దార్ కార్యాలయంలో సమాచారం కోసం, సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం, ఇల్లందు సింగరేణి భూముల విషయమై షెడ్యూల్ ప్రాంతమైన ఇల్లందులో సింగరేణికి ఎన్ని హెక్టార్ల భూమిని
లీజుకు ఇచ్చారు, సింగరేణికి లీజుకు
ఇవ్వడానికి ప్రజలతో గ్రామసభ
నిర్వహించారా, ఇక్కడి ప్రజలు ఎన్నో ఏళ్ల నుండి ఇక్కడే ఉంటున్నారు కదా అట్టి భూములను కూడా లీజుకు ఇచ్చారా అనే పలు అంశాలపై ఆర్టీఐ యాక్ట్ (రైట్ టు ఇన్ఫర్మేషన్) ద్వారా దరఖాస్తు చేశానని దరఖాస్తుదారుడు మాచర్ల విజయ్ కుమార్ తెలిపారు. 30 రోజులలో ఇవ్వవలసిన సమాచారం ఇవ్వకుండా, తాసిల్దార్ కార్యాలయం చుట్టూ దరఖాస్తు దారున్ని తిప్పుకుంటూ అధికారులు కాలయాపన చేస్తున్నారన్నారు. సమాచారం కొరకు తాసిల్దార్ కార్యాలయానికి దరఖాస్తు చేసి 40 రోజులు అయిందని అధికారులను అడగగా పొంతన లేని సమాధానంతో, మీరు అడిగిన సమాచారం మా రికార్డ్ లో లేదు అని సమాధానం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సమాచార హక్కు చట్టం సామాన్యుని చేతిలో ఒక ఆయుధం అని ప్రభుత్వాలు చెబుతున్నప్పటికీ ఇల్లందులో రెవిన్యూ అధికారులు మాత్రం సమాచార హక్కుని నిర్వీర్యం చేస్తున్నారని. మాచర్ల విజయ్ కుమార్ ఇట్టి విషయం పై అధికారులు దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు.

82
7202 views