
ఉపాధ్యాయుని క్రూర చర్యతో విద్యార్థులు కంటి చూపు కోల్పోవడంపై
అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలంలో ఓ ఉపాధ్యాయుని క్రూర చర్యతో విద్యార్థులు కంటి చూపు కోల్పోవడంపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. ఎన్ హెచ్ ఆర్ సి. తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.
నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ డాక్టర్ సంపత్ కుమార్, బుల్లెట్ రవి ఆదేశాల మేరకు బాధితులను పరామర్శించిన నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. ఎన్ హెచ్ ఆర్ సి. స్టేట్ యూత్ సెక్రటరీ కృష్ణమూర్తి రెడ్డి, డివిజినల్ సెక్రటరీ నవ్యకాంత్ రెడ్డి, జిల్లా నాయకులు, తక్షణమే న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
బి. కొత్తకోట సమీపంలోని గట్టు గ్రామపంచాయితి గట్ల వద్ద ఏర్పటైనా రిషి వాటిక గురుకులం పాఠశాలలో *విద్యార్ధి పై ఉపాద్యాయుడు దాడి రాయితో కొట్టి శేషాద్రి రెడ్డి కంటిని కోల్పోవడం సమాజానికి మచ్చ అని నాయకత్వం ఖండించింది.
తక్షణమే నిందితుల్ని అరెస్ట్ చేసి కఠిన శిక్ష విధించాలని, ప్రభుత్వ ఖర్చుతో మెడికల్ ట్రీట్మెంట్ అందించాలని, కుటుంబానికి ఆర్థిక–వైద్య సహాయం కల్పించాలని స్పష్టం చేసింది.
"న్యాయం జరిగేంతవరకు పోరాటం కొనసాగిస్తాం" అని నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్. ఎన్ హెచ్ ఆర్ సి. హెచ్చరించారు