ప్రజా ప్రతినిధులు మందలించిన మారని వి హెచ్ సి తీరు
అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం శరభవరం గ్రామంలో ఉన్న విహెచ్ సి ఏరోజు కూడా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదని, బుచ్చంపేట పి.హెచ్.సి పరిధిలో ఉన్న విలేజ్ హెల్త్ క్లినిక్ ల వల్ల ప్రజలకు ఓరిగీదేమీలేదు. ఇందులో ముఖ్యంగా వద్దిప సరభవరం వి. హెచ్. సి ఎప్పుడూ మూసే ఉంటుంది. ఎప్పుడూ క్లినిక్ లో వుండకుండా ఏజెన్సీ గిరిజనులు పీ.టి.జి ల గ్రామాలైన లోసింగి, పీతురుగెడ్డ, కోరుప్రూలు గ్రామాలకు వెళ్తున్నట్టు చెప్పుకుంటుంది. వాళ్ళు పండించే పంట సాగు ఫలాలను ఆశించి కొర్రలు, సామలు, అరటిపళ్ళు ఇంకా మరెన్నో తీసుకురావటానికి వెళ్తుంది. వెళ్ళమని అదికారులు అదేశాలు లేకపోయినా ఈవిడ మారన ఈవిడ మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగిపోతుంది.. అదేవిధంగా మిగతా వి. హెచ్. సి ల పరస్థితి ఆగమ్యగోచరం గా వుంది. గతంలో ప్రజా ప్రతినిధులు ఎన్నిసార్లు మందలించిన ఈమె తీరు మాత్రం మారడం లేదని, అధికారులు ఇప్పటికైనా విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ప్రజల కోరుతున్నారు