logo

ఆంధ్రప్రదేశ్‌లో 'స్క్రబ్‌ టైఫస్‌' కేసులు

ఆంధ్రప్రదేశ్‌లో 'స్క్రబ్‌ టైఫస్‌' కేసులు కలకలం రేపుతున్నాయి. నల్లిని పోలిన చిన్న కీటకం కుట్టడం వల్ల ఈ వ్యాధి వస్తుంది. ముఖ్యంగా చిన్న పిల్లలపై దీని ప్రభావం అధికం. జ్వరం, కండరాల నొప్పి, తలనొప్పి వంటి లక్షణాలుంటాయి. చికిత్స ఆలస్యమైతే మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కు దారితీసి ప్రాణాంతకం కావచ్చు. నెల్లూరు జిల్లాలో నాలుగు కేసులు నమోదయ్యాయి. పరిసరాల శుభ్రత, ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరి. లక్షణాలు కనిపిస్తే రక్త పరీక్ష చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.

0
67 views