తేది:06.10.2025
అదిలాబాద్ జిల్లా సోమవారం
గ్రామ పంచాయతీలకు 2వ సాధారణ ఎన్నికలు - 2025
ROs, ARO s స్టేజ్ 1,2 శిక్షణా కార్యక్రమం
గ్రామ పంచాయతీలకు సంబంధించిన 2వ సాధారణ ఎన్నికల నేపథ్యంలో, సోమవారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఎన్నికల నిర్వహణలో కీలకమైన ROs (Returning Officers) స్టేజ్-II / AROs (Assistant Returning Officers) స్టేజ్-I అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
ఈ శిక్షణా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా ముఖ్య అతిథిగా హాజరై, ఎన్నికల నిర్వహణలో పాటించవలసిన నియమాలు, ప్రామాణిక ప్రక్రియలు , బాధ్యతల పై దిశానిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమం లో ACLB రాజేశ్వర్ , dpo రమేష్, dlpo ఫణీంద్ర, శిక్షణా నిర్వాహకులు లక్ష్మణ్,తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ మాట్లాడుతూ, “ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా, శాంతియుతంగా నిర్వహించడమే ప్రధాన లక్ష్యం. అధికారులు వారి విధులను పూర్తి నిబద్ధతతో నిర్వహించాలని” అన్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ద్వారా అధికారులకు పూర్తి స్థాయిలో అవగాహన కలుగజేయడమే ఉద్దేశమని తెలిపారు.
మండలాల్లో ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని తెలిపారు.