logo

అదిలాబాద్ జిల్లా, అక్టోబర్ 6 :- ప్రజా సమస్యల పరిష్కారాని కై ప్రజా ఫిర్యాదుల రోజు నిర్వహణ.



బాధితుల ఫిర్యాదులను స్వీకరించి, అధికారులకు ఫోన్ ద్వారా సూచనలు.

సోమవారం పోలీసు ముఖ్య కార్యాలయం నందు గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహణ.

32 ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారానికి సిబ్బందికి వెంటనే ఫోన్ ద్వారా ఆదేశాలు జారీ.

జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్.

ఆదిలాబాద్ జిల్లా ప్రజలు మరియు సుదూర ప్రాంతాల వారు జిల్లా కేంద్రంలోని పోలీస్ ముఖ్య కార్యాలయంలో సమస్యల పరిష్కారానికి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారిని సంప్రదించడం జరిగింది. యధావిధిగా ప్రతి సోమవారం ఆదిలాబాద్ పోలీస్ ముఖ్య కార్యాలయం నందు గ్రీవెన్స్ డే కార్యక్రమం నిర్వహించడం జరిగిందని జిల్లా ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా పోలీసు ముఖ్య అధికారిని కలవడానికి వచ్చిన బాధితుల ఫిర్యాదులను జిల్లా ఎస్పీ స్వయంగా నేరుగా విని, సంబంధిత పోలీస్ అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలిచ్చి త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. బాధితుల సమస్యలను పరిష్కరించినప్పుడు, సత్వర న్యాయం చేసినప్పుడు పోలీసు వ్యవస్థ పై మరింత నమ్మకం పెరుగుతుందని సూచించారు. ఎలాంటి సందర్భంలోనైనా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజల సేవలకై అందుబాటులో ఉంటూ విధులను నిర్వర్తిస్తుందని సూచించారు. అందిన ఫిర్యాదులలో భూ సమస్యలు, నకిలీ దస్త్రావీజులతో రిజిస్ట్రేషన్ల సమస్యలు, కుటుంబ కలహాలు, భార్యాభర్తల సమస్యలు, పోలీస్ స్టేషన్లో కేసుల పురోగతి, తదితర అంశాలు స్వీకరించబడినవి వాటితో పాటు సివిల్ తగాదాలు తదితర విషయాలలో చట్ట ప్రకారం నడుచుకోవాలని అధికారులకు ఆదేశించారు.ఈరోజు జిల్లా నలుమూలల నుండి 32 ఫిర్యాదుల ను స్వీకరించడం జరిగింది. సుదూర ప్రాంతాల వారు జిల్లా ఎస్పీ గారికి నేరుగా సంప్రదించాలంటే 8712659973 కి వాట్సాప్ ద్వారా సమాచారం ఫిర్యాదులను తెలియజేయవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో సీసీ కొండ రాజు, ప్రజా ఫిర్యాదుల విభాగం అధికారిని జైస్వాల్ కవిత సిబ్బంది వామన్ తదితరులు పాల్గొన్నారు.

11
1099 views