
స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ బిజెపి అభ్యర్థులను చిత్తుచిత్తుగా ఓడించేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు
.. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బోరజ్, జైనథ్ మండలాల నాయకులు కార్యకర్తల సమావేశాన్ని ఏర్పాటు చేయగా మాజీ మంత్రి జోగు రామన్న గారు పాల్గొని స్థానిక సంస్థల ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. మాజీ మంత్రి జోగు రామన్న గారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో బి ఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారు అన్నారు. కాంగ్రెస్ బిజెపిలకు స్థానిక సంస్థల ఎన్నికలు గట్టి గుణపాఠం కానున్నాయన్నారు. రైతులు వర్షాలతో పంటలు పూర్తిగా దెబ్బతిని ఆపన్న హస్తం కోసం ఎదురు చూస్తూ ఉంటే బిజెపి కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎన్నికల గురించి హడావిడి చేయడం సిగ్గుచేటు అన్నారు.. రైతులను ఆదుకోవాల్సింది పోయి రాజకీయాలు చేయడం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుకు పరాకాష్టగా మిగులుతుంది అన్నారు. స్థానిక ఎమ్మెల్యే భూ కబ్జాలపై కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంలో విఫలం అవడం వారిద్దరి మధ్య ఒప్పందాలు బలపాడమే కారణమవుతుందన్నారు. 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేయడమే తప్ప జనానికి చేసింది ఏమీ లేదన్నారు. రైతు పత్తి కొనుగోళ్లలో కేంద్ర ప్రభుత్వ విధానాలు స్పాట్ బుకింగ్ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందన్నారు. స్థానిక ఎంపీ ఎమ్మెల్యే హైదరాబాద్ ఢిల్లీ చెక్కర్లు కొట్టడం తప్ప రైతాంగానికి ఆదుకోవడంలో విఫలమయ్యారన్నారు.. కచ్చితంగా స్థానిక సంస్థల్లో బి ఆర్ఎస్ పార్టీ పూర్తిస్థాయిలో గెలుచుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో మార్శెట్టి గోవర్ధన్. యాసం నర్సింగరావు. లింగారెడ్డి. మద్దుల ఉషన్న, బట్టు సతీష్, వేణుగోపాల్ యాదవ్, గణేష్ యాదవ్, కోరెడ్డి ఆనంద్ రావు,సతీష్, భోజన్న తదితరులు పాల్గొన్నారు