logo

లోకాయుక్త ఆర్డర్ ను దిక్కరించిన పంచాయతీ అధికారులు సోమవారం లోకాయుక్తలో "తీర్పు ధిక్కారంపై విచారణ"

లోకాయుక్త ఆర్డర్ ను దిక్కరించిన పంచాయతీ అధికారులు

సోమవారం లోకాయుక్తలో "తీర్పు ధిక్కారంపై విచారణ"

జగిత్యాల జిల్లా / బుగ్గారం :

2024 డిసెంబర్ 6న జారీ చేసిన లోకాయుక్త జస్టిస్ ఆర్డర్ ను జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారులు ధిక్కరించారు. ఈనెల 6 సోమవారం తీర్పు దిక్కరణ పిర్యాదుపై లోకాయుక్త ఆప్ తెలంగాణ లో విచారణ జరగనుందని ఆదివారం చుక్క గంగారెడ్డి విలేఖరులకు తెలిపారు. లోకాయుక్త ఆర్డర్ ను అమలు చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు జిల్లా అదనపు కలెక్టర్ 2025 జనవరి 6న జిల్లా పంచాయతీ అధికారికి ఉత్తర్వులు జారీ చేసారు. బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆ ఉత్తర్వులలో
ఆదేశించారని ఆయన అన్నారు. ఇట్టి ఆదేశాల ప్రతిని డిపివో కుట్ర పన్ని ఒక పిర్యాదు దారుడుగా తనకు అందకుండా చేయడమే కాకుండా అదనపు కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వుల సమాచారం ను కూడా జిల్లా పంచాయతీ అధికారి చీకోటి మదన్ మోహన్ గోప్యంగా ఉంచారని చుక్క గంగారెడ్డి ఆరోపించారు. సమాచార హక్కు చట్టం దరఖాస్తు ద్వారా గత ఆగస్ట్ 6న డిపివో చీకోటి మదన్ మోహన్ చేసిన కుట్ర పూరిత "అంతర్గత గుట్టు రట్టయిందని" చుక్క గంగారెడ్డి వివరించారు. అంతే కాకుండా అనేక సార్లు జిల్లా కలెక్టర్ కు తాను బుగ్గారం గ్రామస్తులతో కలిసి అందజేసిన పిర్యాదుల మేరకు 2025 మార్చి 10 న మరోసారి జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేసారు. బుగ్గారం గ్రామ పంచాయతీ నిధుల దుర్వినియోగం పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని మండల పంచాయతీ అధికారి షేక్ అఫ్జల్ మియా కు అట్టి ఉత్తర్వులలో ఆదేశాలు జారీ చేశారని పేర్కొన్నారు. జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారి "చీకోటి మదన్ మోహన్" తో పాటు బుగ్గారం మండల పంచాయతీ అధికారి "షేక్ అఫ్జల్ మియా" లు ఇద్దరూ దోపిడీ దారులతో కుమ్మక్కై ఇట్టి ఉత్తర్వులను కూడా తుంగలో త్రొక్కి అమలు చేయలేదని చుక్క గంగారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 2025 జులై 1 మళ్లీ లోకాయుక్త ఆప్ తెలంగాణ లో చుక్క గంగారెడ్డి పిర్యాదు చేశారు. లోకాయుక్త జస్టిస్ ఇచ్చిన ఆర్డర్ ( తీర్పు ) ను జగిత్యాల జిల్లా అధికారులు ధిక్కరించి అమలు చేయడం లేదని ఆరోపించారు. అట్టి పిర్యాదుపై ఈ నెల 6న సోమవారం ఉదయం : 11-00 గంటలకు విచారణ కలదని, ఇట్టి విచారణకు తనను హాజరు కావాలని లోకాయుక్త నుండి నోటీసులు అందినట్లు చుక్క గంగారెడ్డి వివరించారు.

2
71 views