
ఓటు చోర్ .....గద్దిచోడ్....
ఎస్.కోట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో "ఓటు చోర్ గద్దిచోడ్" కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. విజయనగరం జిల్లా జామి మండలం జామి గ్రామంలో జరిగిన ఈ కార్యక్రమానికి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ డాక్టర్ గేదెల తిరుపతి నాయకత్వం వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ గేదెల తిరుపతి మాట్లాడుతూ ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేయడం ఆనందదాయకమని పేర్కొన్నారు. ఎన్నికలలో జరుగుతున్న ఓటు దోపిడీని అరికట్టేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణలో కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ ముందుఉండుపోతుంది తెలిపారు.
కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు బోని అప్పారావు, నక్కల సత్యనారాయణ, చలుమూరి త్రిపురాంతకం, బీల నాయుడు, లగుడు శ్రీను, కోడూరు హైమ. కృష్ణ, అప్పుడు మరియు సురేష్ దేముడు తదితరులు పాల్గొన్నారు. స్థానిక పెద్దలు, యువకులు, మహిళలు, అభిమానులు, శ్రేయోభిలాషులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
కార్యక్రమంలో భాగంగా డాక్టర్ గేదెల తిరుపతి చేతుల మీదుగా "ఓటు చోర్ గద్దిచోడ్" పోస్టర్‌ను ఆవిష్కరించడం జరిగింది.