logo

"ఆటో డ్రైవర్ల సేవలో" కార్యక్రమానికి బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట అక్టోబర్4 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

విజయవాడలోముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నేతృత్వంలో విజయవాడలో నిర్వహించనున్న "ఆటో డ్రైవర్ల సేవలో" మహా కార్యక్రమానికి హాజరయ్యే ఆటో డ్రైవర్లు, వాహన మిత్రుల బృందం జగ్గయ్యపేట నుండి ప్రత్యేక బస్సుల ద్వారా బయలుదేరింది. ఈ బస్సులకు శుభయాత్రగా జెండా ఊపి ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ తాతయ్య ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ: "ఆటో డ్రైవర్లు మన సమాజంలో కీలకంగా సేవలందిస్తున్నారు. వారి శ్రమకు గుర్తింపుగా ప్రభుత్వం అందిస్తున్న సహాయం ప్రతి డ్రైవర్ కుటుంబానికి మద్దతుగా నిలుస్తుంది. జగ్గయ్యపేట నుండి బయలుదేరుతున్న ప్రతి వాహన మిత్రునికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు." ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు, వాహన మిత్ర సంఘాల ప్రతినిధులు, అనేక మంది అభిమానులు పాల్గొన్నారు.

2
67 views