logo

శ్రీశ్రీశ్రీ కనకదుర్గ అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న జీవీఎంసీ డిప్యూటీ మేయర్..

గాజువాక (పెదగంట్యాడ మండలం )
76 వార్డ్ బర్మా కాలనీలో కొలువుదీరిన శ్రీ శ్రీ కనకదుర్గ అమ్మవారి కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న జీవీఎంసీ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి. ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ అర్చకులు శర్మ చేతుల మీదుగా అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది. దల్లి గోవిందరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కోరిన కోరికలకు ఇచ్చే కల్పవల్లి శ్రీ కనకదుర్గ అమ్మవారి కరుణాకటాక్షాలు ప్రజలకు ఎల్లవేళలా ఉండాలని ఆ దుర్గమును కోరడం జరిగిందని తెలిపారు. కళ్యాణ మహోత్సవంలో కొంత సమయం గడిపిన తరువాత అన్నదాన కార్యక్రమంలో ఆ ప్రసాదం విస్తరణ చేయడం నాకు ఎంతో సంతోషదాయకంగా ఉందని తెలిపారు. ఆలయ అభివృద్ధికి నా వంతు సహాయ సహకారాలు అందిస్తూ అలాగే ప్రజల సమస్యల పైన తక్షణమే నెరవేర్చే విధంగా చర్యలు చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో బర్మా కాలనీ ప్రెసిడెంట్ రాజు, ఆలయ కోశాధికారి నాగ వరలక్ష్మి,మంగ లక్ష్మి, వరలక్ష్మి ఆలయ కమిటీ సభ్యులు,బిల్లా వంశీధర్,భవానీలు భక్తులు పాల్గొన్నారు.

16
530 views