logo

శ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి దసరా నవరాత్రి ఉత్సవాల్లో.....

గాజువాక (చిన్న నడిపురు గ్రామం)
76వ వార్డులో శ్రీశ్రీ నూకాంబిక అమ్మవారి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి సురేష్ శర్మ దసరాకు సంబంధించి పూర్తి వివరాలు ఆయన మాటల్లో విందాం దేవి నవరాత్రి పూజలతోపాటు విజయదశమి పండుగను తెలుగు రాష్ట్రాల్లోనూ దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు. ఏడాది అక్టోబర్‌ 2వ తేదీన దసరా పండుగ జరుపుకోనున్నారు.ఈ ఏడాది సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకూ దసరా నవరాత్రి ఉత్సవాలు నిర్వహించనున్నారు.
22 తేదీన - శ్రీ బాలాత్రిపురసుందరిదేవి అలంకారం,23తేదీ - శ్రీ గాయత్రి దేవి అలకారం,
24తేదీ - శ్రీ అన్నపూర్ణ దేవి అలంకారం,25తేదీ - శ్రీ కాత్యాయినీ దేవి అలంకారం, 26తేదీ - శ్రీ మహా లక్ష్మీదేవి అలంకారం, 27తేదీ - శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అలంకారం,28తేదీ - శ్రీ మహా చండీదేవి అలంకారం,29తేదీ - మూలా నక్షత్రం రోజున శ్రీసరస్వతి దేవి అలంకారం,30తేదీ - శ్రీ దుర్గా దేవి అలంకారం,1తేదీ - శ్రీ మహిషాసురమర్ధిని దేవి అలంకారం,2తేదీ - విజయదశమి రోజున శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకారం 11 అవతారాలు పూర్తయ్యాయని ఈ 11 అవతారాలు 12 సం|| ఒకసారి వస్తుంటాయని తెలిపారు. దసరా ఎందుకు జరుపుకుంటారు అన్నది పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటారు.ఈ రోజున శ్రీరాముడు రావణుడిని సంహరించడం,దుర్గాదేవి మహిషాసురుడిని వధించడం వంటి సంఘటనలను స్మరించుకుంటారు.ఈ పండుగను విజయదశమి అని కూడా అంటారు, ఇది నవరాత్రుల ముగింపును సూచిస్తుంది.
దసరా పండుగ ప్రాముఖ్యత:

అధర్మంపై ధర్మ విజయం:
దసరా చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక.

శ్రీరాముడి విజయం:
రామాయణంలో రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయానికి ఇది గుర్తు.

దుర్గాదేవి విజయం:
దుర్గాదేవి 9 రాత్రులు యుద్ధం చేసి మహిషాసురుడిని సంహరించిన రోజు ఇది.

నవరాత్రుల ముగింపు:
దసరా పండుగ నవరాత్రుల (9 రోజుల) ముగింపును సూచిస్తుంది.

ఆయుధ పూజ:
చాలా మంది ఈ రోజు ఆయుధాలను పూజిస్తారు.

దసరా ఎందుకు జరుపుకుంటారు?
రామాయణం ప్రకారం:
హిందూ పురాణాల ప్రకారం,రావణుడిపై శ్రీరాముడు సాధించిన విజయం ఈ పండుగకు ప్రధాన కారణం.

పురాణాల ప్రకారం:
జగన్మాత అయిన దుర్గాదేవి మహిషాసురుడనే రాక్షసుడితో 9 రాత్రులు యుద్ధం చేసి, 10వ రోజున అతన్ని వధించి విజయం సాధించిన సందర్భంగా ప్రజలు ఆనందంగా ఈ పండుగను జరుపుకుంటారు. సంక్షిప్తంగా, దసరా అనేది చెడుపై మంచి విజయాన్ని,ధర్మంపై అధర్మ విజయాన్ని సూచించే పండుగ అని సురేష్ శర్మ తెలిపారు. ఈ యొక్క దసరా నవరాత్రులలో వేలాది మంది భక్తులు విచ్చేసి మాల ధారణ ధరించి నియమనిష్టలతో అమ్మవారిని కొలుచుకుంటారని తథానంతరం నవరాత్రులు పూర్తయిన తర్వాత అమ్మవారికి ఎదుట మాల ధారణ అన్నది నివృత్తి చేస్తారని ప్రతిరోజు అమ్మవారికి పంచామృత విశేషాలు నిత్య పూజ్యులు ధూప దీప నైవేద్యాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.

9
261 views