శరన్నవరాత్రుల మహోత్సవంలో శమీపూజ...
తేదీ: 02-10-2025:శరన్నవరాత్రుల ఉత్సవాలలో భాగంగా శ్రీ గంగా పార్వతీ సమేత నాగేశ్వరస్వామి దేవాలయం దుగ్గిరాలనందు శమీపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. రాచంశెట్టి సుబ్రహ్మణ్యం దంపతులు మరియు వల్లూరి నరసింహారావు దంపతులు ఈ శమీపూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ పూజా కార్యక్రమాన్ని ఆలయ ప్రధాన అర్చకస్వామి నాగేశ్వరం యుగంధర్ గారు నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష పూజలు, అర్చనలు చేశారు. శమీపూజ అనంతరం బాణాలను స్వామివారి పాదాలకు చూపించి, ఆ పిదప గొర్రెపోతు ముఖానికి చూపించి నాలుగు దిక్కులకు, ఆకాశంలోకి మరియు భూమిపైకి వదిలారు. ఈ శమీపూజా కార్యక్రమం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ పూజా విధానము తాడిబోయిన రామస్వామి యాదవ్ పూర్వీకుల నుండి ఆచారంగా వస్తూ ఉంది. శమీపూజలో గ్రామస్తులు కుటుంబ సభ్యులతో అధిక సంఖ్యలో పాల్గొన్నారు. దేవతా మూర్తులైన అమ్మవారు, అయ్యవార్ల అలంకరణలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అర్చకస్వాములు భక్తులకు తీర్ధ, ప్రసాదాలను అందజేశారు.