logo

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ -దుగ్గిరాల- ప్రపంచ అహింసా దినోత్సవము మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతి.....

తేదీ: 02-10-2025: దుగ్గిరాల: ఈరోజు,మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి జయంతుల సందర్భంగా దుగ్గిరాల గ్రామంలోని శివాలయం సెంటరునందు గల మహాత్మాగాంధీ విగ్రహానికి ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ మాట్లాడుతూ " *మవ దేశానికి స్వాతంత్ర్యము సముపార్జించిన ముఖ్య నాయకులలో మహాత్మాగాంధీ ఒకరు. రవి అస్తమించని బ్రిటీష్ సామ్రాజ్యాన్ని తన సత్యము మరియు అహింసా అనే సిద్ధాంతాలతో సత్యాగ్రహం మరియు సహాయ నిరాకరణ అనే ఆయుధాలతో పోరాడి స్వాతంత్ర్యాన్ని సాధించినటువంటి మహోన్నత వ్యక్తి"* అని కొనియాడారు. " *మహాత్మాగాంధీ అంటరాని తనానికి, పరిసరాల పరిశుభ్రతకు, గ్రామ స్వరాజ్యానికి, మహిళా రక్షణకు, మహిళా సాధికారతకు, స్వతంత్ర ఫలాలు అందరికి అందాలని నిరంతరము తలపోసిన వ్యక్తి. హిందూమతం రోజురోజుకూ ఆదరణ తగ్గుతుందని భావించి దళితులకు దేవాలయ ప్రవేశం, సహపంక్తి భోజనాలను ప్రోత్సహించిన మహోన్నతమైన వ్యక్తి. అందుకనే ఆయన రాజయోగిగా ఉండవలసిన వాడు, రాజకీయ నాయకునిగా మారాడు. ప్రపంచంలో రోజురోజుకూ హింస మరియు ఉగ్రవాదం ప్రజ్వరిల్లి ఆస్తినష్టం, ప్రాణనష్టంతో పాటు అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతూ ఉంది. ఈ ప్రపంచమంతా సుఖశాంతులతో ఉండటానికి ఐక్యరాజ్యసమితి వారు గాంధీగారు చూపిన అహింసా విధానమే ఉత్తమమని భావించి ఐక్యరాజ్యసమితిలో తీర్మానము చేసి గాంధీగారి జయంతి అయిన అక్టోబరు 2ను _ప్రపంచ అహింసా దినోత్సవం_ గా ప్రకటించి పాటించుచున్నారు. ఇది మన అందరికి గర్వ కారణము మరియు అహింసా విధానమే మనకు శ్రీరామరక్ష"* అని అన్నారు. తదనంతరం స్వాతంత్ర్య సమరయోధుడు మాజీ కేంద్ర రైల్వే, హోం శాఖా మాత్యులుగా, భారతదేశ రెండవ ప్రధానిగా విశిష్టమైన సేవలు అందించిన లాల్ బహదూర్ శాస్త్రిగారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా రామస్వామి యాదవ్ మాట్లాడుతూ " *శాస్త్రిగారు నీతి, నిజాయితి, నిబద్ధత కలిగిన మహోన్నత వ్యక్తి"* అని కొనియాడారు. " *1965 వ సంవత్సరంలో భారత, పాక్ యుద్ధ సమయంలో భారత జాతినంతా ఏక తాటిపై నడిపించి విజయం సాధించారు. జై కిసాన్, జై జైవాన్ అనే స్ఫూర్తిదాయకమైన నినాదాలతో జాతిని ఉత్తేజ పరచారు. నేటి యువత ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని అవినీతిని, స్వార్థ పరమైన ఆలోచనలను విడనాడి, సమాజంలో ఉన్న దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడి దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించాలి"* అని కోరారు.
ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు వెనిగళ్ళ కృష్ణప్రసాద్, గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వివేకానంద, బాలరాజు మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు నల్లనూకల వెంకటేశ్వరరావు, పసుపులేటి గణేష్, హనుమాన్, తాడిబోయిన దేవేందర్ రావు, గరిక శ్రీనివాసరావు, కుర్రా నాగయ్య, తాడిబోయిన వెంకయ్య, బలుసుపాటి ఎల్లయ్య, గండు పాములు తదితరులు పాల్గొన్నారు.

40
1750 views