logo

బుగ్గారం బతుకమ్మ వేడుకల్లో జిల్లా బిసి వెల్ఫేర్ అధికారిణి జి. సునిత

బుగ్గారం బతుకమ్మ వేడుకల్లో జిల్లా బిసి వెల్ఫేర్ అధికారిణి జి. సునిత

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో బుధవారం రాత్రి జరిగిన బతుకమ్మ నిమజ్జన వేడుకల్లో గ్రామ ప్రత్యేక అధికారిణి అయిన జిల్లా బిసి వెల్ఫేర్ అధికారిణి జి. సునిత పాల్గొన్నారు. బతుకమ్మ నిమజ్జన వేడుకలకు చేసిన ఏర్పాట్లను ఆమె పరిశీలించి ప్రశంసించారు. బుగ్గారం మహిళలతో కలిసి బతుకమ్మ ఆడారు. గ్రామ మహిళలు హర్షం వ్యక్తం చేశారు. ముందుగా బుగ్గారం లో నూతనంగా నెలకొల్పిన శ్రీ నవ దుర్గాదేవిని ఆమె దర్శించుకున్నారు. పంచాయతీ కార్యదర్శి యం. ఎ. అక్బర్, తెలంగాణ జన సమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి, గ్రామ ప్రముఖులు, భక్తులు, మహిళలు ఆమె వెంట ఉన్నారు.

4
74 views