logo

జాతరలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని ఆదేశాలు...

విజయనగరం: ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ పైడితల్లి అమ్మవారి జాతర సందర్భంగా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా చర్యలు తీసుకుంటామని నగర మేయర్ విజయలక్ష్మి అన్నారు. నగరపాలక సంస్థ పరిధిలో సోమవారం ఆమె అధ్యక్షతన స్టాండింగ్ కమిటీ సమావేశం నిర్వహించారు. మొత్తం 10 అంశాలను ఎజెండాలో పొందుపరచగా వాటిని అన్నిటిని కమిటీ సభ్యులు ఆమోదించారు. పైడితల్లి అమ్మవారి జాతర సందర్భంగా చేపడుతున్న కార్యక్రమాలను సభ్యులుకు తెలియచేశారు.

29
2763 views