logo

పెదబయలు: సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన

పెదబయలు మండలం, కిముడుపల్లి పంచాయితీ గడుగుపల్లి గ్రామంలో సీసీ రోడ్డు పనులకు ఆదివారం సర్పంచ్ కే శోభారాణి, ఎంపీటీసీ వంతాల కాసులమ్మ శంకుస్థాపన చేశారు. గ్రామంలో 30 మీటర్ల సీసీ రోడ్డు నిర్మిస్తున్నట్లు సర్పంచ్ తెలిపారు. ఈ సీసీ రోడ్లు కొరకు15వ ఆర్ధిక సంఘం నిధులు రూ.1.8 లక్షలు మంజూరైనట్లు చెప్పారు. వార్డ్ సభ్యులు వంతాల బాలన్న, కూటమి నాయకులుకొర్రా రాజారావు, గ్రామస్తులు పాల్గొన్నారు.

20
709 views