logo

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్_ప్రపంచ హృదయ (గుండె) దినోత్సవ అవగాహన కార్యక్రమం.......

తేది: 28 -09 -2025 :ఈరోజు ఉదయం శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలో గల హుడా ట్రేడ్ సెంటర్ సీనియర్స్ సిటిజెన్ భవన్ నందు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో, ప్రపంచ హృదయ (గుండె) దినోత్సవ అవగాహన కార్యక్రమాన్ని,సిటిజన్ హాస్పిటల్ నల్లగండ్ల వారి సౌజన్యంతో నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ పాతూరి అవినాష్ (కార్డియాలజిస్టు) హాజరయ్యారు. వారు ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మాట్లాడుతూ, పర్యావరణంలో వచ్చే పెను మార్పులతో, మారిన జీవనశైలితో,మానవుడు గుండె జబ్బులతో, సతమతమవుతున్నాడు. గుండె జబ్బులు రోజురోజుకు అధికమగుచున్నాయి. దీనితో ప్రాణ నష్టం, ఆర్థిక నష్టం జరుగుతుంది. నష్ట నివారణకై ప్రపంచ ఆరోగ్య సంస్థ (హెచ్ డబ్ల్యు ఓ )మరియు వరల్డ్ హార్ట్ ఫెడరేషన్ వారు సంయుక్తంగా 2011వ సంవత్సరము సెప్టెంబర్ 29 నుండి ప్రతి సంవత్సరం ఒక నినాదంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు . ఈ సంవత్సరం నినాదం ' *బీట్ ను దాటవేయవద్దు* '. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం గుండెను ఆరోగ్యంగా చూసుకోవడం, గుండె జబ్బుల వల్ల జరిగే అనర్థాలను వ్యాధి లక్షణాలను మరియు నివారణ పై అవగాహన కల్పించటమే అని అన్నారు. పిడికెడు గుండె మానవుని జీవితాన్ని నిర్దేశిస్తుందని అన్నారు. గుండె మన శరీరంలో అత్యంత ముఖ్యమైన అవయవం. ఇది శరీరంలో ఛాతి, ఊపిరితిత్తుల మధ్య ఉంటుంది.గుండె ఆక్సిజన్ పోషకాలను రక్తం ద్వారా శరీరంలోని అన్ని భాగాలకు సరఫరా చేస్తుంది అని అన్నారు. మారిన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వల్ల వయసు మరియు లింగ భేదము లేకుండా, ఎక్కువమంది గుండె సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నారు. గుండెలోని రక్తనాళాల్లోని బ్లాకులు పూడికల వల్ల రక్తప్రసరణకు అవరోధం ఏర్పడి,రక్తాన్ని గుండె సరఫరా చేయలేక పోతుంది. దీని ఫలితంగా హార్ట్ ఎటాక్ (గుండెపోటు) వస్తుంది. వ్యాధి రావడానికి గల కారణాలు మధుమేహము, బిపి,అధిక బరువు,శారీరక శ్రమ లేకపోవడం, ఒత్తిడి ఎక్కువగా ఉండడం, ధూమపానం మరియు మద్యపానం సేవించడం వల్ల, అధిక కొవ్వు పదార్థాలు మరియు మైదాతో చేసిన ఆహార పదార్థాలు తీసుకోవడం వలన గుండెపోటు వస్తుంది అని అన్నారు. **వ్యాధి లక్షణాలు* -గుండెలో ఆకస్మికంగా నొప్పి రావడం, అది మెడ వరకు ప్రాకడం, ఆకస్మికమైకం మరియు వికారం, శరీరమంతా చెమటలు పట్టి చల్లగా అయిపోవడం, ఇబ్బంది పడడం చాతిలో నొప్పి ప్రారంభమై క్రమంగా ఎడమ చేయి ఎడమ దవడ మరియు కుడి చేయి వరకు ఈ నొప్పి వ్యాపిస్తుంది. గుండె సంబంధిత సమస్యలు ఉంటే గుండె సాధారణం కంటే ఎక్కువగా కొట్టుకుంటుంది అని తెలియజేశారు.'ఆరోగ్యమే మహాభాగ్యం' కావున కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకుంటే మన ఆరోగ్యం మన చేతులలో ఉంటుంది. *నివారణ చర్యలు* మధుమేహం మరియు కొలెస్ట్రాల్ నియంత్రణలో పెట్టుకోవాలి. ధూమపానం మానేయాలి శారీరక శ్రమ వ్యాయామం ప్రాణాయామం ధ్యానం మరియు నడక వంటి నిత్య కృత్యాలు కనీసం 40 నిమిషాల పాటు చేయాలి. ఫాస్ట్ ఫుడ్, శీతల పానీయాలు, మరియు కేలరీలు అధికంగా ఉన్న ఆహార పదార్థాలను మానివేయాలి.
రెడ్ మీట్ పూర్తిగా మానేయాలి. వంట నూనెలు తక్కువగా వాడాలి. తాజా ఆకుకూరలు, సీజనల్ ఫ్రూట్స్, డ్రైఫ్రూట్స్, మొలకలు, తృణధాన్యాలు చేపలు, గుడ్లు, పాలు , పాల ఉత్పత్తులు వాడాలి. రోజు కనీసం 6 నుండి 7గంటలు గాఢ నిద్రపోవాలి. ఈ జాగ్రత్తలు పాటించి, ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని తెలియజేశారు.సంవత్సరమునకు ఒకసారి వైద్య పరీక్షలు చేయించుకోవాలి. 2డ్ ECO పరీక్షలు చేయించుకోవాలి,అలాగే గుండెపోటు వచ్చినప్పుడు హాస్పరిన్ టాబ్లెట్ చెప్పరించాలి. అలాగే ఇలాంటి కార్యక్రమాలలో పాల్గొనాలి అని చెప్పారు. ఈ కార్యక్రమం పురస్కరించుకొని BP and SUGAR , 2D Eco పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ ఆదిత్ సీనియర్స్ సిటిజెన్ వెల్ఫేయిర్ అసోసియేషన్ నాయకులు ఫ్రొఫెసర్ జయంత్ కుమార్, జి నరసింహారావు , వేణుమోహన్ రావు , పాండురంగయ్య , కాశీ విశ్వనాధ్ , వి యాదయ్య మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు అమ్మయ్య చౌదరి, కొక్కుల జనార్ధన్, పాలం శ్రీను, శివరామకృష్ణ, విష్ణు ప్రసాద్, ప్రేమ్ సింగ్ హాస్పటల్ ప్రతినిధి జాకీర్ , శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.

100
1655 views