logo

పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం

AIMA న్యూస్ శ్రీకాకుళం : (కొత్తూరు) పౌష్టికాహారంతో ఆరోగ్యం కలుగుతుందని టిడిపి జిల్లా కార్యదర్శి జి కమలాకర్ చెప్పారు మండలంలో మెట్టూరు పంచాయితీలో స్థానిక అంగన్వాడి కేంద్రంలో పౌష్టికాహార సమావేశం శుక్రవారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఆరోగ్య పరిరక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తుందన్నారు గర్భిణీలు బాలింతలు, చిన్నారులకు తప్పనిసరిగా పౌష్టికాహారం అందించాలని ఆయన సూచించారు కార్యక్రమంలో సూపర్వైజర్ భవాని చిన్నారులకు గర్భిణీలకు బాలింతలకు పౌష్టికాహార ప్రాముఖ్యత తెలియజేస్తూ ఆహారాన్ని అందించారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి అరబోలు దశరధ రావు
గ్రామ పెద్దలు మినీ అంగన్వాడి టీచర్లు హెల్పర్లు బాలింతలు పాల్గొన్నారు

0
758 views