logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రైతన్నలకు అధిక దిగుబడులు సాధించాలంటే సేంద్రుల ఎరువులతోనే సాద్యo

రైతన్నలకు అధిక దిగుబడులు సాధించాలంటే సేంద్రుల ఎరువులతోనే సాధ్యమనీ వినూత్న ఆగ్రోటెక్ ప్రతినిధులు అన్నారు. మార్కెటింగ్ డెవలప్మెంట్ ఆఫీసర్ ప్రభాకర్ నాయుడు, సిద్ధార్థ , ఫీల్డ్ అసిస్టెంట్ గజ్జలన్న , వెంకటేష్, లు అన్నారు . నంద్యాల జిల్లా, ధోనే మండల పరిధిలోని సీసంగుంతల గ్రామంలో నిర్వహించిన రైతు సదస్సు కార్యక్రమంలో వారు రైతన్నలకు సేంద్రియ ఎరువులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రసాయనిక ఎరువులు వాడటం వలన భూసారం దెబ్బతిని వాతావరణం కలుషితమవుతుందని వారు గుర్తు చేశారు. తద్వారా పంటలకు చీడపురుగులు పెరిగిపోయి దిగుబడి తగ్గిపోతుంది అని పేర్కొన్నారు సేంద్రియ ఎరువులో వాడటం వలన భూసారం పెరగడమే కాకుండా నాణ్యమైన అధిక దిగుబడులను సాధించవచ్చు అన్నారు . సేంద్రియ ఎరువులైన చక్ర, ప్రొటెక్ట్ -1
ఆల్ట్రా ఫోకస్ ,నిల్స్, అల్టిమేట్ ప్లస్, సీ గోల్డ్, ఇగ్నిస్ -55, జనని, జీవన్ గోల్డ్,డైనమైట్ తదితర సంబంధించిన మందుల గురించి వివరించడంతోపాటు అవి ఏ మోతాదులో ఏ సమయంలో పిచికారి చేయాలో వివరించడం జరిగింది.అదేవిధంగా రైతులు పండిస్తున్న వివిధ పంటలలో సస్యరక్షణ చర్యల గురించి రైతులకు వివరించారు ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన రైతు సదస్సు కార్యక్రమంలో నేటి వ్యవసాయంలో రసాయన ఎరువులు మరియు రసాయన మందులు వాడటం నానాటికి పెరిగిందన్నారు వీటి ప్రభావం వల్ల మనకు తెలియకుండానే భూమిలో ఉన్న జీవరాశులపై అధికంగా ఒత్తిడి పెరగడంతో పాటు అధిక రసాయన ఎరువులు వాడటం వల్ల భూమిలోని జీవరాశులలో అతి ముఖ్యమైన సముదాయమైన సూక్ష్మంగా జీవుల పైన పడి వాటి సంఖ్య తగ్గిపోతుంది అన్నారు తద్వారా గణనీయమైన మార్పులు భూమిలో సంతరించుకుని భూమికున్న సహజ గుణాలు మరియు ఆరోగ్య పరిస్థితి నానాటికి క్షమిస్తుందన్నారు తద్వారా రైతుకు పెట్టుబడి విషయంలో అధికమై భారం కూడా పడుతుందన్నారు సేంద్రియ ఎరువులు వాడటం వల్ల రైతులకు పెట్టుబడి తగ్గడంతో పాటు భూమి సారవంతంగా తయారవుతుందన్నారు.పలు గ్రామాల్లో సేంద్రీయ జీవన ఎరువులపై "రైతు అవగాహన సదస్సు " కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధులు, రైతు సోదరులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

71
2068 views

Comment