ఒంటిమిట్టలో 600 అడుగుల శ్రీరాముడి విగ్రహం!
AP: కడపలోని ఒంటిమిట్టను జాతీయ పర్యాటక కేంద్రంగా మార్చేందుకు TTD ప్రణాళికలు చేస్తోంది. రామాలయం సమీపంలోని చెరువులో 600 అడుగుల శ్రీరాముడి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం. ఇప్పటికే విజయవాడకు చెందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణులు దీనికి సంబంధించిన నివేదికను TTD అధికారులకు అందజేశారు.