logo

తణుకు పట్టణంలో ఘనంగా జరిగిన ప్రపంచ ఫార్మసిస్టు దినోత్సవ వేడుకలు

తణుకు పట్టణంలో గల పశ్చిమగోదావరిజిల్లా మందులవర్తకసంఘ భవనములో ప్రపంచ ఫార్మసిస్టు దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేసి, రిజిస్టర్డ్ ఫార్మసిస్టుల సాధకబాధకాల గురించి చర్చించారు. ఈ సమావేశంలో తణుకు డ్రగ్ ఇన్స్పెక్టర్ మల్లిఖార్జున్ గారు, తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రి డి.సి.ఓ యాళ్ళ వెంకటేశ్వరరావు గారు, తణుకు కెమిస్ట్& డ్రగ్గిస్ట్ అసోసియేషన్ సెక్రెటరీ రాము గారు, ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఇమ్మంది నాగ కృష్ణంరాజు గారు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షుడు బింకం అనీల్ చక్రవర్తి గారు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫార్మసిస్టులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు.

6
822 views