ప్రపంచ ఫార్మసిస్టు దినోత్సవం సందర్భంగా రక్తదాన కార్యక్రమం
ఈరోజు అనగా సెప్టెంబర్ 25వ తేదీన ప్రపంచ ఫార్మసిస్టు దినోత్సవం సందర్భంగా తణుకు పట్టణంలో గల రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకులో ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ సంక్షేమ సంఘము మరియు గుడ్ వే ట్రస్ట్ సంయుక్తంగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ఫార్మశీ సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఇమ్మంది నాగ కృష్ణంరాజు, పశ్చిమ గోదావరి జిల్లా అధ్యక్షులు మరియు గుడ్ వే ట్రస్ట్ ఫౌండర్ & చైర్మన్ బింకం అనీల్ చక్రవర్తి సంయుక్తంగా నిర్వహించారు. తణుకు పరిసరప్రాంత యువకులు వచ్చి రక్తదానం చేసారు.