విశాఖ: ముఖ్యమంత్రికి ఆత్మీయ వీడ్కోలు
ఒక రోజు పర్యటనలో భాగంగా సోమవారం నాడు విశాఖ విచ్చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు తిరుగు పయనంలో ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికారు.
సోమవారం ఉదయం హోటల్ నోవోటల్ లో జరిగిన 28వ జాతీయ ఈ గవర్నెన్స్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న అనంతరం 12-07గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోస్టల్ బ్యాటరీ వద్ద హెలిపాడ్ చేరుకున్నారు.
ముఖ్యమంత్రికి కోస్టల్ బ్యాటరీ హెలిపాడ్ వద్ద పార్లమెంటు సభ్యులు ఎంపి భరత్, జిల్లా కలెక్టర్ హరేంధిర ప్రసాద్, పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్చీ, జాయింట్ కలెక్టర్ కే మయూర్ అశోక్, విఎంఆర్డిఏ కమిషనర్ కే విశ్వనాథన్, జీవీఎంసీ కమిషనర్ కేతన్ గార్గ్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఇతర అధికారులు ఆత్మీయ వీడ్కోలు పలికాారు.* కోస్టల్ బ్యాటరీ హెలిపాడ్ నుండి 12: 14 గంటలకు, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, విజయవాడ తాడేపల్లి తిరుగు పయనమయ్యారు.