logo

చిరు వ్యాపారులకు న్యాయం చేయండి.

విశాఖ కాంగ్రెస్ అధ్యక్షులు హాసిని వర్మ రాజు

ఆర్ డి ఓ కు వినతి పత్రం అందజేత

కలెక్టర్ ఆఫీసు
విశాఖపట్నం

సెప్టెంబర్ 22, 2025

జీ.వీ.ఎం.సీ 8 జోన్లు పరిధిలో
వీధి విక్రయ దారుల, బడ్డీలు అక్రమంగా తొలగించడం ఆపాలి
చిరు వ్యాపారులకు ఉపాది కల్పించాలని. వీధి విక్రయదారుల రక్షణ చట్టాలు అమలు చేయాలని తొలగించిన చిరు వ్యాపారుల షాపులు పునరుద్ధరించాలని ఈ రోజు సోమవారం విశాఖ నగర కాంగ్రెస్ పార్టీ నాయకులు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్డాల వర్మ రాజు నేతృత్వంలో కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు..జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఆర్ డి ఓ. భవాణి శంకర్ ను కలిసి విశాఖ నగరంలో 8 జోన్ లలో ఆపరేషన్ లంగ్స్ పేరిట చిరు వ్యాపారుల షాపులను తొలంగించడం హేయమైన చర్య అని దీనిని కాంగ్రెస్ పార్టీ తరపున ఖండిస్తున్నామని తక్షణమే చిరు వ్యాపారులను ఆదుకోవాలని వారికి ప్రత్యామ్నాయ మార్గాలు చూపాలని, అర్థంతరంగా ఎటువంటి నోటీసులు జారీ చేయకుండా ఇలా వారి దుకాణాలు తొలగించడం వారి పొట్ట కొట్టడమే అని వారి కుటుంబ పోషణ కష్టంగా మారుతుందని వారి భవిష్యత్ కార్యాచరణ పట్ల ప్రభుత్వం వెంటనే తగు చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాలని వర్మ రాజు, ఆర్ డి ఓ ను కోరారు..అందుకు సానుకూలంగా స్పందించిన ఆర్ డి ఓ ప్రస్తుతం ఈ వ్యవహారం జీవీఎంసీ కమిషనర్ చూస్తున్నారని దీనిపై కలెక్టర్ గారితో చర్చించి తగు రీతిలో చిరు వ్యాపారులకు నష్టం జరగకుండా జీవీఎంసీ కమిషనర్ తో మాట్లాడి భవిష్యత్ ప్రణాళికలు సిద్ధం చేసేలా చూస్తామని ఆర్ డి ఓ తెలిపారు..

ఈ కార్యక్రమంలో వర్మ రాజు తో పాటు ఇంచార్జి గాదం మహేష్ రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులు లక్కరాజు రామారావు, రాష్ట్ర స్పోర్ట్ సెల్ చైర్మన్ కమలాకర్,జిల్లా ప్రధాన కార్యదర్శి వంకర ఆనంద కుమార్,యూత్ స్టేట్ జనరల్ సెక్రటరీ శివ,పి సీ సి మెంబర్ జగన్ ఇంకా ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

12
1501 views