logo

అల్జీమర్స్ వ్యాధి (మతిమరుపు) దినోత్సవ అవగాహన కార్యక్రమం...

ది 20-09-2025, షేర్ లింగంపల్లి, చందానగర్ :ఈరోజు ప్రపంచ మతిమరుపు వ్యాధి దినోత్సవాన్ని పురస్కరించుకొని, సిటిజన్ హాస్పిటల్ నల్లగండ్ల వారు అవగాహన కార్యక్రమమును నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డాక్టర్స్ , శ్రీ చరణ్ వాడపల్లి, డాక్టర్ అపర్ణ విజయ్ కుమార్ సీనియర్ కన్సల్టెంట్ న్యూరాలజీ, హాజరయి, సీనియర్ సిటిజన్స్ కు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వాళ్లు మాట్లాడుతూ, ఈ కార్యక్రమము యొక్క ముఖ్య ఉద్దేశం ఈ వ్యాధిపై అవగాహన కల్పించడమే కాక, నివారణ చర్యలను వివరించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు, సుమారు ప్రపంచంలో ఆరు కోట్ల మంది డిమోన్షియంతో బాధపడుతున్నట్లు నివేదికలు తెలుపుతున్నాయన్నారు. భవిష్యత్తులో డిమాన్షియా బాధిత సంఖ్య పెరిగే అవకాశం ఉందని తెలియజేశారు. దీనివల్ల అల్జీమర్స్ వస్తుంది. దానికి కారణం రక్తనాళాల్లో, మెదడులో సమస్యలు ఏర్పడడమే అని అన్నారు. ఇది ముఖ్యంగా 60 సంవత్సరాలు పైబడిన వారిలో ఎక్కువగా కనిపిస్తుంది అని అన్నారు. నష్ట నివారణ చర్యలు చేపట్టడానికై ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు 1994 సెప్టెంబరు 21 నుండి ప్రపంచ అల్జీమర్స్ దినోత్సవాన్ని ఒక ప్రత్యేక నినాదంతో నిర్వహిస్తున్నారు . ఈ సంవత్సరం నినాదం "మెదడు ఆరోగ్యం- ప్రమాదం తగ్గింపు" అని అన్నారు. ఈ వ్యాధి లక్షణాలు తమ సొంత కుటుంబ సభ్యుల పేర్లు మర్చిపోతారని అన్నారు. బయటికి వెళ్లినప్పుడు ఇంటిదారి మర్చిపోవడం, వ్యక్తిగత పరిశుభ్రతను, ఆఖరికి భోజనం చేసిన విషయాన్ని మర్చిపోతుంటారు. దీని వల్ల శ్రద్ధ ఏకాగ్రత తగ్గిపోతాయి. వ్యాధి ముదిరే కొద్ది ఆలోచన శక్తి, సమస్య పరిష్కార సామర్థ్యం లోపిస్తాయి అన్నారు. ఈ మతిమరుపు రెండు రకాలుగా ఉంటాయని అన్నారు. మనుషులలో ప్రధానంగా తాత్కాలిక మతిమరుపు, తీవ్ర మతిమరుపు.తాత్కాలిక మతిమరుపు 60 సంవత్సరముల లోపు ఉన్నవాళ్లలో కనిపిస్తుందని అన్నారు. దీనికి కారణం మానసిక ఒత్తిడి, ఆందోళన, పోషక ఆహారం లోపం వల్ల,పిల్లలు మరియు మద్య వయస్కులు తాత్కాలిక మతిమరుపు తలెత్తుతుందన్నారు. దీనికి నివారణ కౌన్సిలింగ్ మరియు పౌష్టికాహారం అందిస్తే మామూలు స్థితికి చేరుతారని అన్నారు. తీవ్ర మతిమరుపు 60 సంవత్సరాలు పైబడిన వారిలో కనిపిస్తుందన్నారు. దీనికి కారణం రక్తనాళాల్లో,మెదడులో సమస్యలు ఏర్పడడమేనని అన్నారు.భారతదేశం సుమారు 90 లక్షలకు పైబడి ఈ వ్యాధి తో బాధపడుతున్నారని అన్నారు. అధ్యయనాల ప్రకారం గ్రామీణ ప్రాంత ప్రజల్లో మరియు స్త్రీలలో ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారని అన్నారు. దీనికి కారణం విటమిన్ బి విటమిన్ డి విటమిన్ ఈ, పోలిక్ యాసిడ్ లోపం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుందని వైద్య నివేదికలు తెలుపుతున్నాయన్నారు. మరియు మద్యపానము, ధూమపానము,మాదకద్రవ్యాల వినియోగము, థైరాయిడ్, రక్తహీనత,మధుమేహం,అధిక రక్తపోటు,ఊబకాయం లాంటివి, గాయాల వల్ల జన్యుపరంగానూ, ఈ మతిమరుపు వ్యాధి సోకడానికి అవకాశం ఉందన్నారు. 'ఆరోగ్యమే మహాభాగ్యం' కావున సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలంటే, రోజు మెదడుకు పదునుపెట్టే చదరంగం, పజిల్స్ పూరించడం,ఇండోర్ గేమ్స్, రాయడం, చదవడం తో పాటు, పౌష్టిక ఆహారం తీసుకుంటూ, ఒమేగా ప్యాటి ఆమ్లాలు అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. చేపలు, తాజా ఆకుకూరలు, పాలు పెరుగు, బాదం, జీడిపప్పు,ఇతర తాజా కూరగాయలు, తృణధాన్యాలు, పండ్లు,తీసుకొని, కనీసం రోజుకు ఆరు గంటలు నిద్రపోవాలి, తప్పనిసరిగా విహార వ్యాయామం చేయాలి.ఈ నియమాలు పాటించి, సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా సీనియర్ సిటిజన్స్ అడిగిన పెక్కు సందేహాలను నివృత్తి చేశారు. ఈ కార్యక్రమంలో హాస్పటల్ సిబ్బంది, పలు కాలనీల సీనియర్ సిటిజన్స్ మరియు ముఖ్యంగా ఉడా ట్రేడ్ సెంటర్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు, ఆదర్శనగర్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ వారు, నల్లగండ్ల ఉడా వెల్ఫేర్ అసోసియేషన్ వారు, మరియు ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడి బోయిన రామస్వామి యాదవ్, మరియు సభ్యులు అత్యధిక సంఖ్యలో పాల్గొన్నారు.

71
1968 views