
ఇది మంచి ప్రభుత్వం కాదు ? వంచించే ప్రభుత్వం ?
చంద్రబాబుకు చిరు వ్యాపారులంటే అంత చులకనా ?
ఇదేనా పేదలకు మీరిచ్చిన దసరా కానుక ?
డిప్యూటీ సీఎం పవన్ అభిమానులకు పస్తులు? తన ఓజీ సినిమాకు ఆస్తులా ?
చిరు వ్యాపారులకు జరిగిన అన్యాయంపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంది ..
విశాఖ లో చిరువ్యాపారుల దుకాణాలు తొలగింపుపై కూటమి ప్రభుత్వాన్ని నిలదీసిన విశాఖ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వర్మ రాజు
సెప్టెంబర్ 21, 2025
ఆదివారం
విశాఖలో పలు చోట్ల చిరు వ్యాపారుల దుకాణాలు తొలగించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకుంది..తమ పొట్ట కొట్టారంటూ చిరు వ్యాపారులు ఆందోళన చెందుతున్నారు.. మేమెలా బ్రతకాలి అంటూ అధికారులను నిలదీస్తున్నారు..డాబా గార్డెన్ దరి ఫుడ్ కోర్టు నందు పలు దుకాణాలను అలాగే విశాఖలో పలు చోట్ల ఎటువంటి ముందస్తు నోటీసులు జారీచేయకుండా తొలంగించారంటూ ఆవేదన చెందుతున్నారు..తమ బ్రతుకులు రోడ్డున పడ్డాయని వేదన చెందుతున్నారు..
ఈ నేపధ్యంలో చిరు వ్యాపారులకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ రంగంలోకి దిగుతుంది..జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు అడ్డాల వెంకట వర్మ రాజు నాయకత్వంలో కూటమి పార్టీ నియంతృత్వ పోకడలను అడ్డుకొని చిరు వ్యాపారులకు న్యాయం జరిగేలా పోరాటం చేయడానికి సిద్ధపడుతుంది..
రెక్కాడితే గానీ డొక్కాడని చిరు వ్యాపారుల బ్రతుకులపై ఉక్కు పాదం మోపింది కూటమి ప్రభుత్వం..చంద్రబాబును ఓటేసి గెలిపిస్తే ఇదేనా మీరిచ్చే బహుమానం ఇదేనా మీరిచ్చిన దసరా కానుక అంటూ వర్మ రాజు ఒక ప్రకటనలో కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు.
ముందస్తు సమాచారం లేకుండా ఏకంగా జీసీబీ క్రేన్లు సహాయంతో ఉన్నపలానా వారి షాపులను ధ్వంసం చేసి వారి పొట్టన కొట్టడం మీకు న్యాయమా అంటూ ప్రశ్నించారు...నోటిలో మాటలేని వారు ఏమి చేయలేని నిరుపేదలు అని మీరు అనుకుంటే వారి పక్షాన మేము నిలబడి పోరాటం చేస్తాం. ఇది " *మంచి ప్రభుత్వం కాదు పేదలను వేధించే ప్రభుత్వం* '' అంటూ వర్మ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. జనసేన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కు ఈ పేదల గోడు పట్టదా ? అభిమానికి పస్తులు మీ ఓజీ సినిమాకు ఆస్తులా ? మీకు మీ సినిమా గోల తప్ప జనాల గోడు పట్టదా ? కూటమిని గెలిపించిన వారి పీకల మీద కాలు పెట్టడం సరైందేనా? మీ వల్ల సుమారు 50000 కుటుంబాలు రోడ్డున పడ్డాయని చిరు వ్యాపారులను ఆర్ధికంగా ఇబ్బందులకు గురి చేయడం మీ ప్రభుత్వం చేసిన మంచి ఇదేనా? ఒక వైపు మీ సూపర్ సిక్స్ సూపర్ ఫ్లాప్..అది చాలదు అన్నట్టు ఇలా పేదల బ్రతుకుల తో ఆడుకోవడం మీకు అలవాటుగా మారిందని దుయ్యబట్టారు.
ఇకనైనా చిరు వ్యాపారులకు న్యాయం చేయాలని, వారికి ప్రత్యామ్నాయ మార్గాలను చూపాలని డిమాండ్ చేశారు.. లేనట్లయితే కాంగ్రెస్ పార్టీ వారి పక్షాన పోరాటం చేస్తుందని చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు..