logo

బిట్స్ లో ఘనంగా బతుకమ్మ సంబరాలు

స్థానిక భూపాలపల్లి పట్టణంలోని బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ లో ముందస్తుగా బతుకమ్మ మరియు దసరా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలను పురస్కరించుకొని విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు తెలంగాణ ఆడపడుచుల పండుగ అయిన బతుకమ్మను తీరక పూలతో పేర్చి గౌరమ్మను ప్రతిష్టించి, పూజించి ఉత్సవాలను ప్రారంభించారు. ముందుగా స్థానిక ప్రిన్సిపాల్ ఎం. శ్రీనివాస చారి బతుకమ్మ వేడుకలను ఘనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ తెలంగాణకు తలమానికంగా ఉన్నటువంటి బతుకమ్మ పండుగను మన పాఠశాలలో నిర్వహించుకోవడం చాలా ఆనందంగా ఉందని, పూలను పూజించడం గొప్ప సాంప్రదాయం తెలంగాణ ప్రాంతానికి మాత్రమే ఉందని తెలియజేశారు. మొదటిరోజు ఎంగిలిపూల బతుకమ్మతో మొదలై తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు ముగుస్తాయని, అనంతరం విజయదశమి పండుగ నిర్వహించుకుంటామని తెలియజేశారు. ఈ బతుకమ్మ మరియు దసరా పండుగలు ప్రతి కుటుంబంలో ఆనందాలు నింపాలని వారికి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిద్ధించాలని ఈ బాలాజీ విద్యాసంస్థల తరఫున గౌరవ తల్లిదండ్రులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. చిన్నారులు తీరోక పూలతో బతుకమ్మలు పేర్చుకొని వచ్చి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను కన్నుల పండుగగా నిర్వహించి, బతుకమ్మ పాటలతో పాఠశాల ప్రాంగణము మార్మోగిపోయింది. అనంతరం రావణ దహనంతో విజయదశమి వేడుకలను నిర్వహించి వేడుకలను ముగించారు. ఈ కార్యక్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థిని, విద్యార్థులు మరియు ఉపాధ్యాయునీ, ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేశారు.

8
598 views