logo

మహిళల రక్షణకు నూతన అవగాహన



పార్వతీపురం,:
మహిళలపై లైంగిక వేధింపులు (నివారణ, నిషేధం మరియు పరిష్కారం) చట్టం–2013పై అవగాహన కల్పించేందుకు గురువారం పార్వతీపురం కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ప్రభాకర్ చేతుల మీదుగా “పిఒఎస్‌హెచ్ యాక్ట్–2013” పోస్టర్‌ను విడుదల చేశారు.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్, ఐసిడిసి పీడీ కె. కనకదుర్గ, వన్ స్టాప్ సెంటర్ శాంతికుమారి, జిల్లా బాలల విభాగం తాడ్డి పైడిపునాయుడు, జి. తవిటినాయుడు, వేణు, సుబ్రహ్మణ్యం తదితర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

మహిళలపై లైంగిక వేధింపులను అరికట్టడానికి చట్టంపై అవగాహన పెంపొందించుకోవాలని, అందరూ కలిసి పనిచేయాలని కలెక్టర్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.

0
101 views