logo

పేదల వైద్యానికి సీ ఎం సహాయ నిధి భరోసా. రాజకీయాలకతీతంగా సేవలు. ఎమ్మెల్యే సుజనా చౌదరి. AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist

పేదల వైద్యానికి సీ ఎం సహాయ నిధి భరోసా.
రాజకీయాలకతీతంగా సేవలు.
ఎమ్మెల్యే సుజనా చౌదరి.
AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
పేద కుటుంబాలకు, అత్యవసర వైద్యానికి ముఖ్యమంత్రి సహాయనిధి ఎంతో భరోసాగా నిలుస్తోందని విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు

భవాని పురం ఎన్డీఏ కార్యాలయంలో పశ్చిమ నియోజకవర్గంలోని 18 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద మంజూరైన చెక్కులను గురువారం ఆయన అందజేశారు.

రూ 14 లక్షల 48 వేలను అందించినట్లు ఎమ్మెల్యే సుజనా తెలిపారు.

ఆర్థికంగా, బలహీనంగా ఉన్న రోగులకు, పేద వర్గాలకు సీఎం సహాయనిధి ఎంతో ఉపయోగపడుతుందన్నారు.

రాజకీయాలకతీతంగా , అవినీతికి తావు లేకుండా సీఎం సహాయనిధి చెక్కులను అందజేస్తున్నామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు.

పశ్చిమ ప్రజలకు ఎల్లవేళలా సేవలందించడానికి ఎన్డీఏ కార్యాలయం సిద్ధంగా ఉందని భరోసానిచ్చారు..

ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ , ఆర్య వైశ్య మహా సభ గౌరవాధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మసాని సుబ్బారావు,టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్,జనసేన పార్టీ ఆంధ్రా జోన్ కన్వీనర్ బాడిత శంకర్, జనసేన పార్టీ ప్రచార కమిటీ కో ఆర్డినేటర్ తిరుపతి సురేష్ , కార్పొరేటర్లు బుల్లా విజయ్ కుమార్, గుడివాడ నరేంద్ర రాఘవ, మరుపిళ్ళ రాజేష్ , అత్తలూరి ఆదిలక్ష్మి పెద్దబాబు,కూటమి నేతలు తిరుపతి అనూష, పైలా సురేష్, అవ్వారు బుల్లబ్బాయి, పచ్చి పులుసు శివప్రసాద్, రెడ్డిపల్లి రాజు, బొల్లేపల్లి కోటేశ్వరరావు, అబ్దుల్ ఖాదర్ , ఏలూరి సాయి శరత్, నున్న కృష్ణ, పగడాల కృష్ణ,డాక్టర్ సీ హెచ్ హనుమంతరావు, పీవీ చిన సుబ్బయ్య, అలుగుండ్ల సుబ్బారెడ్డి , గోళ్ళ విశ్వేశ్వరరావు, బడుగు వెంకన్న,చినబాబు, ఉమాకాంత్, వేవిన నాగరాజు, పొట్టి శ్రీహరి,మంగళపురి మహేష్ అజీజ్,బ్రహ్మారెడ్డి, సుజనా మిత్రా కోఆర్డినేటర్లు పాల్గొన్నారు.

11
514 views