
దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
దసరా ఉత్సవాల ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే సుజనా చౌదరి.
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
ఇంద్రకీలాద్రి పై ఈ నెల 22 వ తేదీ నుంచి ప్రారంభం కానున్న దసరా మహోత్సవాల ఏర్పాట్లను విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి గురువారం పరిశీలించారు.
ఇంద్రకీలాద్రి నుంచి కాలి నడకన క్యూలైన్ల వ్యవస్థను ఈ ఓ శీనా నాయక్ మరియు కూటమి నేతలతో కలిసి ఎమ్మెల్యే సుజనా చౌదరి స్వయంగా పనులను పర్యవేక్షించారు.
దుర్గగుడి ఘాట్ రోడ్డు, రథం సెంటర్, కెనాల్ రోడ్డు తదితర ఏరియాలను కాలినడకన వెళ్లి పరిశీలించారు.
క్యూలైన్లలో సైతం నడిచి పరిశీలించారు..
భక్తులకు సంతృప్తికరమైన దర్శనం కల్పించడమే లక్ష్యంగా అధికారులందరూ పనిచేయాలన్నారు.
ఏమైనా సమస్యలు ఉంటే
తన దృష్టికి తీసుకురావాలని అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలని సుజనా చౌదరి ఆదేశించారు.
పెండింగ్ పనులను వేగంగా పూర్తి చేయాలని ఈ ఓ శీనా నాయక్ కు ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు.
ముందుగా ఎమ్మెల్యే సుజనా దుర్గమ్మ వారిని దర్శించుకున్నారు.
ఈ ఓ శీనా నాయక్ ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు స్వాగతం పలికారు.
అమ్మవారి దర్శనానంతరం వేద పండితులు ఆశీర్వదించి అమ్మవారి చిత్రపటాన్ని అందజేశారు..
మరింత ఘనంగా నిర్వహిస్తాం.
ఎమ్మెల్యే సుజనా చౌదరి
గత ఏడాది కన్నా ఘనంగా దసరా ఉత్సవాలను నిర్వహిస్తామని ఎమ్మెల్యే సుజనా తెలిపారు. విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని ఎమ్మెల్యేలు గద్దె రామ్మోనరావు, బోండా ఉమా మహేశ్వరరావు , కూటమి నేతలందరి సమన్వయంతో సమిస్టిగా దసరా ఉత్సవాలను విజయవంతం చేస్తామన్నారు.
గతం లో ఎదురైన సమస్యలను అధిగమించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
హోల్డింగ్ ఏరియాల ఏర్పాటు ట్రాఫిక్ నియంత్రణ , భక్తుల పార్కింగ్ కోసం ప్రత్యేక ప్రణాళికలు రూపొందిస్తున్నామని అన్నారు.
దసరా ఉత్సవాలతో పాటు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్ ను కూడా అంగరంగ వైభవంగా నిర్వహిస్తామని ఎమ్మెల్యే సుజనా చౌదరి తెలిపారు.
సుజనా వెంట ఎన్టీఆర్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ , ఆర్య వైశ్య మహా సభ గౌరవాధ్యక్షుడు పెనుగొండ సుబ్బారాయుడు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎమ్ ఎస్ బేగ్,జనసేన పార్టీ ఆంధ్రా జోన్ కన్వీనర్ బాడిత శంకర్, జనసేన పార్టీ ప్రచార కమిటీ కో ఆర్డినేటర్ తిరుపతి సురేష్ , కూటమి నేతలు తిరుపతి అనూష, పైలా సురేష్, అవ్వారు బుల్లబ్బాయి, పచ్చి పులుసు శివప్రసాద్, రెడ్డిపల్లి రాజు, మంగళపురి మహేష్ అజీజ్,బ్రహ్మారెడ్డి, దొడ్ల రాజా, సత్యసాయి ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.