logo

12వ పిఆర్సీ కోసం మున్సిపల్ కార్మికుల ఆందోళన

ఎన్టీఆర్ జిల్లా నందిగామ సెప్టెంబర్18 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

నందిగామ పట్టణ మున్సిపల్ కార్యాలయం వద్ద ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ (సి.ఐ.టి.యు) నందిగామ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు ధర్నా నిర్వహించబడింది. ఈ సందర్భంగా సి.ఐ.టి.యు ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి కె. గోపాల్ మాట్లాడుతూ:
12వ పి.ఆర్.సి వెంటనే ప్రకటించాలి. మున్సిపల్ కార్మికులందరికీ పి.ఆర్.సి జీతాలు చెల్లించాలి.
18వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ పట్టణాల్లో ధర్నాలు విజయవంతంగా జరిగాయని, 23వ తేదీ విజయవాడలో జరగబోయే ధర్నాను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు.
అలాగే ఆయన పేర్కొంటూ,
రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, ఒప్పంద కార్మికులు 12వ పి.ఆర్.సి కోసం ఎదురుచూస్తున్నారు.
11వ పి.ఆర్.సి గడువు ముగిసి రెండు సంవత్సరాలు గడిచినా, ఇప్పటివరకు 12వ పి.ఆర్.సి కమిటీని ఏర్పాటు చేయలేదని విమర్శించారు. మున్సిపల్ కార్మికుల జీతాలు పెంచాలని, గత జులైలో జరిగిన సమ్మె కాలానికి జీతాలు చెల్లిస్తామని ఇచ్చిన ప్రభుత్వ హామీ ఇప్పటికీ నెరవేరలేదని గుర్తుచేశారు.
గతంలో 17 రోజుల సమ్మె సందర్భంలో ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదని అన్నారు. నందిగామ పట్టణంలో పెరిగిన నివాస ప్రాంతాలకు అనుగుణంగా కార్మికుల సంఖ్య పెంచాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం కార్మికులందరికీ స్వంత బ్యాంక్ ఖాతాలు కల్పించి, వారి సంతకాలతో జీతాలు జమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు దాసవరకు సైదా, సలికేటి నరేష్, పూట్టా మాణిక్యం, రాజరత్నం, బేబీ, రుత్తుమ్మ, నాగరాజు, సంతీష్ తదితరులు పాల్గొన్నారు.

0
0 views