logo

నందిగామ న్యాయవాదుల నిరసన – అడ్వకేట్ సంతాప సభపై జి.ఓ.రద్దు చేయాలని డిమాండ్

ఎన్టీఆర్ జిల్లా నందిగామ సెప్టెంబర్18 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

నందిగామ బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు వరద బోయిన విజయకుమార్ అధ్యక్షతన, నందిగామ కోర్టు పరిధిలో న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. హైకోర్టు వారు జారీ చేసిన సర్క్యులర్ 10/2025 ప్రకారం అడ్వకేట్ మరణించిన సందర్భంలో సంతాప కార్యక్రమాన్ని సాయంత్రం 4:15 గంటలకు మాత్రమే నిర్వహించాలి అనే జి.ఓ.ను వెంటనే రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు మాట్లాడుతూ “న్యాయవాదుల హక్కులను హరించేలా ఉన్న ఈ జి.ఓ.ను రద్దు చేయాలి” అన్నారు.
“దశాబ్దాలుగా అమలులో ఉన్న ఉదయం సంతాప సభ పద్ధతిని కొనసాగించడంలో కోర్టుకు ఎటువంటి ఇబ్బంది లేదు. అంతేకాదు, మరణించిన న్యాయవాదికి వారి కుటుంబ సభ్యులకు గౌరవప్రదమవు తుంది” అని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో బార్ జాయింట్ సెక్రటరీ ఉప్పులూరి డేవిడ్ రాజ్, ట్రెజరర్ మాడుగుల స్టాలిన్ బాబు, స్పోర్ట్స్ అండ్ కల్చర్ సెక్రటరీ గుగులోత్ రామారావు, సీనియర్ ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ చావలి సాంబశివరావు, ఏ.వి. సత్యనారాయణమూర్తి, వేల్పుల కిషోర్, తాడేపల్లి కాంతారావు, దారెల్లి అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
అలాగే సీనియర్ న్యాయవాదులు యర్రం రెడ్డి బాబురావు, కన్నెగంటి జీవరత్నం, మన్నెం నారాయణ రావు, బండి మల్లికార్జునరావు, చిరుమామిళ్ల శ్రీనివాసరావు, దాసరి వెంకట్రావు, కూరగంటి సందీప్, గింజుపల్లి రమేష్, షేక్ సైదా, దర్శి అర్జున్, నెలకుదిటి లక్ష్మీనారాయణ, యరగొర్ల రామారావు, గుడిశ సుమన్, వేల్పుల స్వామి, చెరుకుమల్లి రామారావు, గంటా నాగేశ్వరరావు, ఏడుకొండలు, దున్న కోటి, బొబ్బిళ్లపాటి భాస్కరరావు, గుంజి వాసు, అప్పాజీ, కోటా దేవదాస్, పరిటాల ప్రదీప్, ఆనంద్ విజయభాస్కర్, కొరగంటి ఎల్లయ్య, జక్కులూరి అంజయ్య తదితరులు పాల్గొన్నారు.

0
0 views