
ప్రతి పర్వదినం మతసామరస్యానికి ప్రతీక
ఐక్యతా భావంతో దసరా ఉత్సవాలను విజయవంతం చేద్దాం
శాంతి, సౌభ్రాతృత్వంతో జిల్లాను ఆదర్శవంతంగా నిలబెడదాం
శాంతి కమిటీ సమావేశంలో కలెక్టర్ లక్ష్మీశ్, సీపీ రాజశేఖరబాబు
ఎన్టీఆర్ జిల్లా విజయవాడ సెప్టెంబర్18 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)
విజయవాడలోని కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో గురువారం జిల్లా కలెక్టర్ డా.జి.లక్ష్మీశ్ అధ్యక్షతన శాంతి కమిటీ (Peace Committee) సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.
పర్వదినాలు మతసామరస్యా నికి ప్రతీకలని,
కులమతాలకతీతంగా శాంతి, సౌభ్రాతృత్వంతో ప్రతి పండగ జరుపుకుంటున్నామని,
ఇదే స్ఫూర్తితో దసరా ఉత్సవాలను విజయవంతం చేసి జిల్లాను ఆదర్శవంతంగా నిలబెట్టాలని పేర్కొన్నారు.
ఈసారి దసరా ఉత్సవాలకు 15 లక్షల మందికి పైగా భక్తులు విచ్చేయనున్నారని, సామాన్య భక్తుల సౌకర్యానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రభుత్వం సూచించిన మార్గదర్శకాలకు అనుగుణంగా పటిష్ట ప్రణాళికలు అమలు చేస్తున్నట్టు వివరించారు. ఆధునిక సాంకేతికత వినియోగంతో భక్తులకు విజయవాడ పర్యటన మధురానుభూతిగా మిగిలేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. పోలీస్ కమిషనర్ ఎస్.వి.రాజశేఖరబాబు మాట్లాడుతూ.
శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడటం ప్రతి ఒక్కరి బాధ్యత,
సోషల్ మీడియాలో వదంతులు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు ఉంటాయని,
భక్తుల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్, సీసీటీవీలు, డ్రోన్ నిఘా వంటి అన్ని అంశాల్లో ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
విజయవాడ శాంతికి ప్రతీక:
విజయవాడ శాంతియుత వాతావరణానికి ప్రతీక అని, దసరా ఉత్సవాల విజయవంతం కోసం తమ వంతు సహకారం అందిస్తామని వివిధ మతాల పెద్దలు హామీ ఇచ్చారు. బుడమేరులో వరదల సమయంలో ఐక్యతా భావంతో సహకరించినట్లే, మున్ముందు కూడా ఆత్మీయతతో ముందడుగు వేస్తామని తెలిపారు. సమావేశంలో ఆర్డీవో కావూరి చైతన్య, డీసీపీ కేజీవీ సరిత, ఎండోమెంట్ ఏసీ ఎన్. షణ్ముగం, డీఎండబ్ల్యూ అబ్దుల్ రబ్బానీ, వివిధ మతాల పెద్దలు తదితరులుపాల్గొన్నారు.