logo

"విద్యార్థులను అభినందించిన 'వాకర్స్ క్లబ్ సభ్యులు'



శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్, అంజనీ పుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జాతీయ పాఠశాల క్రీడా విభాగంలో స్థానిక అయ్యన్నపేటకు చెందిన తైకొండా క్లబ్ కు చెందిన విద్యార్థులు చి' రెడ్డి కావ్య,చి ' కెల్ల భువనేష్ కు పదునాలుగు సంవత్సరాలలోపు రాష్ట్ర స్థాయిలో తైకొండా క్రీడలో ఇటీవల ఎంపికైన సందర్బంగా గురువారం ఉదయం 42వ డివిజన్ పరిధిలో.. అయ్యన్నపేట జంక్షన్ వద్దనున్న మున్సిపల్ కార్పొరేషన్ నడక మైదానంలో క్రీడా విద్యార్థులను, తైకొండో కోచ్ శేఖర్ ను క్లబ్ సభ్యులు మరియు ప్రముఖ సాహితీవేత్త, మాజీ పార్లమెంట్ సభ్యులు,రెగ్యులర్ వాకర్ డాక్టర్ డి.వి.జి.శంకరరావు చేతులమీదుగా సత్కరించారు.

ఈ సందర్బంగా డాక్టర్ డి.వి.జి. శంకరరావు మాట్లాడుతూ విద్యార్థినీవిద్యార్థులకు చదువుతోపాటు తైకొండో, కరాటే నేర్చుకోవటం ద్వారా ఆత్మ విశ్వాసం,ఆత్మ స్థైర్యం పెంపొందుతాయని, ప్రస్తుత పరిస్థితుల్లో ఆడపిల్లల ఆత్మరక్షణ విద్య అయిన ఇటువంటి మార్షలార్ట్స్ ను తప్పకుండ నేర్చుకోవాలన్నారు.

కార్యక్రమంలో శ్రీ సాయి కృష్ణా వాకర్స్ క్లబ్ అధ్యక్షులు తాడ్డి ఆదినారాయణ,అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ వ్యవస్థాపకులు, ప్రముఖ సామజిక వేత్త త్యాడ రామకృష్ణారావు (బాలు), వాకర్స్ క్లబ్ పెద్దలు కోట్ల సత్యనారాయణ,వై. నల్లమరాజు,పెనుమత్స అప్పలరాజు, కోట్ల ఈశ్వరరావు,త్యాడ ప్రసాద్ పట్నాయక్,నరేష్,జి. సూర్యప్రకాశరావు,పిన్నింటి లక్ష్మణరావు,రైల్వే. రామకృష్ణ, తదితర పెద్దలు పాల్గున్నారు.

~త్యాడ రామకృష్ణారావు(బాలు)

0
0 views