logo

చలో మెడికల్ కాలేజ్ కి ఎటువంటి అనుమతులు లేవు.ఆళ్లగడ్డ. డి.ఎస్.పి ప్రమోద్

AIMA న్యూస్ మీడియా. నంద్యాల జిల్లా. ఆళ్లగడ్డ డి.ఎస్.పి ప్రమోద్ గురువారం రోజున ప్రెస్ నోట్ విడుదల చేశారు. అందులోని సారాంశం.19-09-2025 వ తేదీ శుక్రవారం ఉదయం 10.00 గం.లకు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వై.య‌స్.ఆర్. కాంగ్రెస్ పార్టీ విద్యార్థి, యువజన విభాగాల తో కలిసి.ఛలో మెడికల్ కాలేజ్ పేరుతో. నంద్యాల జిల్లా లోని మెడికల్ కాలేజీ దగ్గరకు శాంతియుతంగా వెళ్లి, అక్కడి వాస్తవ పరిస్థితులను మీడియా ద్వారా ప్రజలకు వివరించే కార్యక్రమానికి. జిల్లా పోలీసు వారు ఎటువంటి పర్మీషన్ మంజూరు చేయలేదు. నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఫస్ట్ ఇయర్ మరియు సెకండ్ ఇయర్ పరీక్షలు ఉదయం 10:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు జరుగుతున్నాయి. ఈ పరీక్షలు 30-09-2025 వరకు కొనసాగనున్నాయి. కావున వైఎస్సార్సీపీ నాయకులు నంద్యాల, పాణ్యం, మెడికల్ కాలేజీలో చేపట్టదలచిన ఆందోళన కార్యక్రమం పరీక్షల నిర్వహణకు అంతరాయం కలిగించే అవకాశం ఉన్నది . అంతే కాకుండా సదరు కార్యక్రమము విద్యార్థుల భవిష్యత్తుపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది.
అందువల్ల, 19-09-2025 తేదీన నంద్యాల మెడికల్ కాలేజీ వద్ద ఏ విధమైన సమావేశాలకు అనుమతి ఇవ్వబడదు.
అదనంగా, పోలీస్ చట్టం సెక్షన్ 30 అమలులో ఉన్నందున ఏవైనా గుంపులు, ర్యాలీలు, ప్రదర్శనలకు ఎటువంటి అనుమతి లేదు. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆళ్లగడ్డ డిఎస్పి ప్రమోద్ హెచ్చరించారు.

87
3143 views