logo

ఆళ్లగడ్డ. తక్షణమే ప్రభుత్వం స్పందించాలి. వైసీపీ నేత భూమా కిషోర్ రెడ్డి

AIMA న్యూస్ మీడియా. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ పట్టణంలో వైసిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భూమా కిషోర్ రెడ్డి గురువారం రోజు తన కార్యాలయంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. కూటమి ప్రభుత్వంలో అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి ఏర్పడుతుంది మొక్కజొన్న 🌽 చేతికి అందే తరుణంలో వేల ఎకరాల పంటలు మునిగిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి రైతులకు న్యాయం చేయాలని కోరారు. రైతులు పండించే పంటలు ఇతర ప్రాంతాలకు రవాణా మార్గంలో తరలించే లారీ లపై కూడా ఆంక్షలు విధించేలా లారీ యూనియన్ ఆఫీస్ లో నిర్ణయాలు తీసుకోవడం సరి కాదని. దేశంలో ఎక్కడ నుంచి ఎక్కడికైనా రవాణా చేసుకోవచ్చని ఇతర ప్రాంతాల లారీలు ఇక్కడికి వచ్చి ఇక్కడి నుండి తిరిగి వారి ప్రాంతాలకు వెళ్లేటప్పుడు నామమాత్రపు బాడుగలతో వెళుతూ ఉంటారని ఆ బాడుగల వల్ల రైతులకు ఎంతో మేలు కలుగుతుందని అన్నారు. అయితే ఇప్పుడు పెట్టిన లారీ అసోసియేషన్ వల్ల ఇతర ప్రాంతాలలో లారీలు ఇక్కడ నేరుగా లోడింగ్ చేసుకునే సౌలభ్యం లేకుండా చేశారని అలా ఒకవేళ ఏదైనా లారీ ఇక్కడి నుండి లోడు తీసుకుని వెళ్లాలంటే అధిక డబ్బులు చెల్లించవలసిన పద్ధతిని లారీ అసోసియేషన్ నిర్ణయించడం రైతులకు షరాఘాతం లాంటిదని. రైతులకు ఇబ్బంది కలిగేలా లారీ అసోసియేషన్ నిర్ణయాలు తీసుకుంటే వాటిపై తాము తప్పనిసరిగా పోరాటం చేస్తామని రైతుల పక్షాన నిలబడి వారికి న్యాయం జరిగేంతవరకు న్యాయబద్ధంగా పోరాటం సాగిస్తామని భూమా కిషోర్ రెడ్డి అన్నారు.

44
1737 views