అరకు: ఓఏఎండీసీ సైట్లో డిగ్రీ సీటు అలాట్మెంట్ లెటర్లు
ప్రధమ సంవత్సర డిగ్రీ ప్రవేశాల అలాట్మెంట్ లెటర్ ఓఏఎండీసీ సైట్ లో పెట్టారని అరకు ప్రభుత్వ డిగ్రీ కళశాల ప్రిన్సిపాల్ డా నాయక్ గురువారం తెలిపారు. డిగ్రీ జాయినింగ్ కొరకు అభ్యర్దులు సీటు అలాట్మెంట్ లెటర్, ఆన్లైన్లో సబ్మిట్ చేసిన పత్రాల ఒరిజినల్స్, నాలుగు పాస్ ఫొటోలు, మూడు సెట్ల జిరాక్స్ లతో కళాశాలకు రావాలని ప్రిన్సిపాల్ చెప్పారు. మొదటి దశలో కళాశాలకు 308 సీట్లు కేటాయించినట్లు ఆయన అన్నారు.