logo

ఈ నెల 22న తపాల అదాలత్‌

శ్రీకాకుళం : శ్రీకాకుళం పోస్టల్‌ డివిజన్‌ పరిధిలో తపాల వినియోగదారుల వ్యక్తిగత ఫిర్యాదులు, సమస్యల పరిష్కారానికి ఈ నెల 22న తపాల అదాలత్‌ నిర్వహించనున్నట్లు శ్రీకాకుళం పోస్టల్‌ సూపరింటెండెంట్‌ వి.హరిబాబు బుధవారం తెలిపారు. వినియోగదారులు తమ ఫిర్యాదులను 'తపాల అదాలత్‌' పేరిట 'సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోస్టాఫీసెస్‌, శ్రీకాకుళం పోస్టల్‌ డివిజన్‌, శ్రీకాకుళం - 532001' చిరునామాకు పంపాలని కోరారు. గడువు తర్వాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించబోమని స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని ఎస్‌ఎస్‌ఆర్‌ డిగ్రీ కాలేజ్‌ సమీపంలోని సూపరింటెండెంట్‌ కార్యాలయం వద్ద 22వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు వ్యక్తిగతంగా సమర్పించి అదాలత్‌కు హాజరుకావచ్చని పేర్కొన్నారు. ఆర్థిక అవకతవకలకు సంబంధించిన ఫిర్యాదులు స్వీకరించబోమని స్పష్టం చేశారు.

0
144 views