logo

రైలు ఢీకొని 37 గొర్రెలు మృతి

కంచిలి: మండలంలోని కంచిలి - సోంపేట మార్గం మధ్య రైల్వేట్రాక్‌ను దాటుతుండగా బుధవారం ఉదయం రైలు ఢీకొని 37 గొర్రెలు మృతి చెందాయి. మేతకు వెళ్తున్న క్రమంలో రైలు పట్టాలు దాటుతుండగా అనుకోకుండా ఈ ప్రమాదం చోటుచేసుకొంది. మృతి చెందిన గొర్రెలు బొగాబెణి పంచాయతీ పరిధి జెన్నాగాయి కాలనీకి చెందిన ఇప్పిలి చిన్నారావుకు చెందినవిగా గ్రామస్తులు చెబుతున్నారు. రైలు ప్రమాదంలో గొర్రెలు మృతి చెందడంతో చిన్నారావు కుటుంబం కన్నీరుమున్నీరుగా విలపిస్తోంది. తమకు ఏర్పడిన ఈ నష్టంపై ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు.

10
372 views