logo

**శభాష్ డాక్టర్ రామకృష్ణ*** స్క్రూ డ్రైవర్ మింగిన 8 ఏళ్ల గౌతమ్ ప్రాణాలు కాపాడిన భద్రాచలం ఏరియా ఆసుపత్రి వైద్యులు...

తెలంగాణ స్టేట్ ***భద్రాద్రి కొత్తగూడెం జిల్లా** భద్రాచలం ఏరియా హాస్పిటల్*** సెప్టెంబర్ 18**( ఏఐఎంఎం మీడియా)


**శభాష్ డాక్టర్ రామకృష్ణ***

స్క్రూ డ్రైవర్ మింగిన 8 ఏళ్ల గౌతమ్ ప్రాణాలు కాపాడిన భద్రాచలం ఏరియా ఆసుపత్రి వైద్యులు...


స్క్రూ డ్రైవర్ మింగిన, ఏ ఎస్ ఆర్ జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన గౌతమ్.. ప్రాణాపాయ స్థితిలో భద్రాచలం ఆసుపత్రికి వచ్చిన వైనం...


మూడు గంటల శ్రమించి ఆపరేషన్ చేసి గౌతమ్ ప్రాణాలు కాపాడిన ప్రభుత్వ వైద్యులు...


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో, ఒక కష్టతరమైన ఆపరేషన్ చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అల్లూరి సీతారామరాజు జిల్లా గన్నవరం గ్రామానికి చెందిన గౌతమ్ అనే 8 ఏళ్ల బాలుడి ప్రాణాలు కాపాడిన భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ మరియు వైద్యులు, సిబ్బంది.. గన్నవరానికి చెందిన 8 సంవత్సరాల గౌతమ్ ఆడుకుంటున్న క్రమంలో స్క్రూ డ్రైవర్ మింగడంతో, విపరీతమైన కడుపు నొప్పి రావడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి వెనువెంటనే తీసుకురావడంతో ఆ కండిషన్ లో ఉన్న ఆ బాలుడిని పరీక్షించి, వెంటనే స్పందించి సంబంధిత పరీక్షలు నిర్వహించి, పేగులో ఇరుక్కుపోయిన 6 సెంటీమీటర్ల స్క్రూ డ్రైవర్ ను గంటల సమయం శ్రమించి తొలగించి భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ రామకృష్ణ, మరియు వైద్యులు మరియు సిబ్బంది సహాయంతో విజయవంతంగా ఆపరేషన్ నిర్వహించి ఆ స్కూ డ్రైవర్ ను బయటికి తీసి గౌతమ్ ప్రాణాలు కాపాడారు, లక్షల రూపాయలు ఖర్చు అయ్యే ఆపరేషన్ ఎటువంటి రూపాయి కూడా ఖర్చు కాకుండా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి భద్రాచలంలో నిర్వహించిన వైద్యులకు, మరియు సిబ్బందికి బాలుడు కుటుంబ సభ్యులు, మరియు వారి గ్రామస్తులు, కృతజ్ఞతలు తెలుపుకున్నారు.. ఇంతటి మంచి కార్యక్రమానికి పూనుకున్న భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్ మరియు, వైద్యులు, సిబ్బందికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి...

134
4682 views