logo

కన్నతల్లిపై అత్యాచారయత్నం..... కొడుకును కొట్టి చంపిన తండ్రి..... మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఘటన....

మద్యం మత్తులో మృగంలా మారి కన్నతల్లిపైనే లైంగిక దాడికి యత్నించిన ఓ యువకుడిని అతని తండ్రే కొట్టి చంపేశాడు. తాగిన మైకంలో రాక్షసుడిగా......

జడ్చర్ల, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): మద్యం మత్తులో మృగంలా మారి కన్నతల్లిపైనే లైంగిక దాడికి యత్నించిన ఓ యువకుడిని అతని తండ్రే కొట్టి చంపేశాడు. తాగిన మైకంలో రాక్షసుడిగా మారినకొడుకుని అడ్డుకునే క్రమంలో ఆ తండ్రి హంతకుడు అయ్యాడు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్లలో జరిగిన ఘటనకు సంబంధించి జడ్చర్ల సీఐ కమలాకర్‌ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. జడ్చర్ల మండలం పోలేపల్లికి చెందిన దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలున్నారు....
వీరిలో ముగ్గురికి వివాహాలు అవ్వగా చిన్నకుమారుడు(28) అవివాహితుడు. ఆ దంపతులు తమ చిన్న కొడుకుతో కలిసి ఒకే ఇంట్లో నివసిస్తున్నారు....
మద్యానికి బానిసైన చిన్న కొడుకు కొన్నాళ్లుగా జులాయిగా తిరుగుతూ జల్సాలకు అలవాటుపడ్డాడు. అయితే, మద్యం మత్తులో ఉండగా ఆ యువకుడు తన కన్నతల్లిపై ఇప్పటికే పలుమార్లు లైంగిక దాడికి యత్నించాడు....
ఈ విషయం తెలిసి కొడుకు తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన తండ్రి.. ప్రవర్తన మార్చుకోవాలని కొడుకుని పలుమార్లు హెచ్చరించాడు....
ఈ క్రమంలో శనివారం ఉదయం నుంచి మద్యం సేవిస్తూ ఉన్న ఆ యువకుడు అర్ధరాత్రి తర్వాత తల్లిపై లైంగిక దాడికి యత్నించాడు. కొడుకు తీరుతో హడలిపోయిన తల్లి గట్టిగా కేకలు వేయగా....
పక్క గదిలో నిద్రిస్తున్న ఆమె భర్త మేల్కోని కొడుకును అడ్డుకునేందుకు యత్నించాడు. కానీ, ఆ యువకుడు తండ్రిని కూడా నెట్టేశాడు....

ఈ క్రమంలో చేతికి దొరికిన కర్రతో ఆ తండ్రి తన కొడుకు తల వెనుక, ముఖంపై బలంగా కొట్టాడు. దీంతో ఆ యువకుడు అక్కడికక్కడే మరణించాడు. విషయం తెలిసి ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు....

0
920 views