logo

రైతుబజార్ సుందరీకరణతో పరిసరాలు పరిశుభ్రం.

విశాఖ పట్నం ఎంవిపి కాలని రైతు బజార్ సుందరీకరణతో పరిసరాలు పరిశుభ్రంగా మారాయని వినియోగదారులు, రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల రైతు బజారును సందర్శించిన మార్కెటింగ్ శాఖ డిడి శ్రీనివాస్ కిరణ్ సూచనల మేరకు రైతు బజార్ ఎస్టేట్ అధికారి కె.వరహాలు, సహాయకుడు కనకరాజు తదితర సిబ్బంది రైతు బజార్లోని చెట్లకు ఆకర్షణీయమైన రంగులను వేయించారు. వివిధ జంతువుల రంగులను చెట్లకు వేయించి వాటిని ఆకర్షణీయంగా చూపరులకు ఆసక్తి కలిగేలా తీర్చి దిద్దారు. ముఖ్యంగా చిన్న పిల్లలకు ఆహ్లాదం, వినోదం పంచుతున్నాయి. దీనికి తోడు రైతు బజార్ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయించి పరిశుభ్ర వాతావరణం ఉండేట్లు చూస్తున్నారు.

5
71 views