logo

ఏసీబీ ఉచ్చులో తల్లాడ మండల ఎమ్మార్వో, ఆర్ఐ, డేటా ఎంట్రీ ఆపరేటర్

తెలంగాణ స్టేట్ **ఖమ్మం జిల్లా తల్లాడ మండలం** సెప్టెంబర్ 17**( ఏఐఎంఎం మీడియా ప్రతినిధి)

*అంతులేని అవినీతికి పరాకాష్టగా నిలుస్తున్న రెవెన్యూ వ్యవస్థ,

*అవినీతి కేసుల్లో శిక్షల్లో కఠిన తరమైన మార్పులు అవసరం అంటున్న ప్రజలు,

*కొన్ని రెవిన్యూ కార్యాలయాల్లో స్థానికంగా పాతుకుపోయిన డేటా ఎంట్రీ ఆపరేటర్లను ఇతర సిబ్బంది ని తొలగించాలి అంటున్న ప్రజలు,

*రెవెన్యూ కార్యాలయాలు అంటేనే భయపడుతున్న ప్రజలు,

తన పేరు మీద భూమి పట్టా చేసేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్, డేటా ఎంట్రీ ఆపరేటర్

ఖమ్మం జిల్లా తల్లాడ మండల రెవెన్యూ కార్యాలయంలో తాను కొన్న భూమిని పట్టా చేసేందుకు రూ.10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కిన తహసీల్దార్ వంకాయల సురేష్ కుమార్, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్ మాలోత్ భాస్కర్ రావు, డేటా ఎంట్రీ ఆపరేటర్ శివాజీ రాథోడ్

41
1483 views