
సృష్టి కర్త విశ్వకర్మ.
- దేశ నిర్మాణంలో విశ్వకర్మ కీలకం... ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
సృష్టి కర్త విశ్వకర్మ.
- దేశ నిర్మాణంలో విశ్వకర్మ కీలకం... ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్
#AIMA MEDIA Suvarnaganti RaghavaRao Journalist
సమాజ వివక్షతకు గురైన విశ్వకర్మలను ఆదుకున్న ఏకైక ప్రధాని నరేంద్రమోదీ.
అమరావతి లో భవ్యమైన రాజధాని.
అమరావతి లో విశ్వ కర్మ విగ్రహం ఏర్పాటు చేస్తాం.
అమరావతి... ప్రధానమంత్రి నరేంద్రమోదీ జన్మదినోత్సం, విశ్వకర్మజయంతి ఒకే రోజు వచ్చిన సందర్భంలో భారతీయ జనతా ఓబిసీ మోర్చా ఆధ్వర్యంలో విశ్వకర్మయజ్ణ మహోత్సవం అమరావతి రాజధాని లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ శంకుస్ధాపన నిర్వహించిన ఉద్దండురాయుని పాలెంలో ఘనంగా నిర్వహించారు. విశ్వకర్మలచే నిర్వహించిన యాగంలో మాధవ్ పాల్గొన్నారు. అనంతరం జరిగిన సభలో మాధవ్ ప్రసంగిస్తూ అమరావతిలో భవ్యమైన రాజధాని నిర్మాణం అవుతుందన్నారు. ప్రధాని మట్టినీరు తీసుకుని వచ్చారని అదే మన సాంప్రదాయమని భగవంతుని ఆశీస్సులతో ఇక్కడ రాజధాని ని ర్మాణం అవుతుందన్నారు. విశ్వకర్మ జయంతి నిర్వహణ దైవ నిర్ణయం అన్నారు
ఈ భూమి విశ్వగురు స్ధానానికి వెళ్ళాలి.ప్రపంచమంతా విశ్వకర్మ జయంతి చేసుకోవాలి.సృష్టిని అందంగా మలచిన వారు విశ్వకర్మ.భారతీయ మూలాలు అందరూ మర్చిపోయారు.ప్రపంచ వాణిజ్యంలో 14వ శతాబ్దంలో 40శాతం భారతదేశం నుంచే జరిగేది.బ్రిటిషర్లు వెళ్ళిపోతూ భారతదేశాన్ని అత్యంత పేద దేశంగా మార్చేశారు.సర్వ ప్రాణులు భగవంతుని స్వరూపులే..పరిశుద్ధాత్మ అంటే ఏమిటో తెలీకుండా ప్రయాణం చేసారంటూ మన పైన, మన సంపద పైన దాడి చేసారు.దేవాలయ వ్యవస్ధలు బ్రాహ్మణులకు సంబంధించినవి అని అనుకుంటాం
దేవాలయాల నిర్మాణంలో అతి ముఖ్యమైన వారు విశ్వబ్రాహ్మణులు.కొందరు ఆధిపత్యం కోసం విశ్వబ్రాహ్మణులను దూరం చేసారు గోత్రాల ఆధారంగా అందరూ ఋషుల, మునుల పరంపర.. విశ్వకర్మల నైపుణ్యం తెలుసుకునే కార్యక్రమాలు జరుగుతున్నాయి.ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనలో అనేకమంది రిజిష్టర్ చేసుకున్నారు.ఈ ప్రాంతంలో విశ్వకర్మ విగ్రహం పెడతాం
రాజ్యసభ సభ్యుడు పాకా సత్యనారాయణ మాట్లాడుతూ
సామాజిక వివక్ష ఆధారంగా బిసిలు ఉన్నారు.విశ్వబ్రాహ్మణులు సామాజిక వివక్షతకు గురయ్యారు.మంగళసూత్రం తయారు చేసే కంసాలులు విశ్వబ్రాహ్మణులు.విశ్వబ్రాహ్మణ తత్త్వాన్ని తగ్గించే ప్రయత్నం విదేశీయుల సమయంలో జరిగింది.ఆర్ఎస్ఎస్ దేశ అస్తిత్వాన్ని, మూలాలను సరిచేస్తుంది మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా అనేవి మోదీ తీసుకొచ్చారు .స్కిల్ ఇండియా ద్వారా సాంకేతిక పరిజ్ఞానం తోడయ్యేలా చేసారు.విశ్వకర్మ యోజన ద్వారా విశ్వబ్రాహ్మణ కులాల అస్తిత్వం తీసుకొస్తున్నారు.భారతదేశ అస్తిత్వాన్ని గురించి ఆలోచించిన పార్టీ బిజెపి మాత్రమేఅన్నారు. భారత ప్రధానిగా నరేంద్రమోదీ వచ్చేంత వరకు ఎవరూ విశ్వకర్మల గురించి ఆలోచించ లేదు.
ఎమ్మెల్యే డాక్టర్ పార్థసారథి మాట్లాడుతూ రాజధాని నగరం లో విశ్వ కర్మ యజ్ఞం చేయడం చాలా సంతోషం.దేశవ్యాప్తంగా చేతి వృత్తులు వారి ని బలోపేతం చేయడానికి .విశ్వ కర్మ యోజన ద్వారా రుణాలు మంజూరు చేయడం జరుగుతోంది..దేశమంతా ఈకార్యక్రమం జరుగుతోంది.ప్రజల కు చేరువ చేయాలన్నారు.
శివస్వామి మాట్లాడుతూ హైందవ ధర్మంలో విశ్వకర్మల పాత్ర ప్రత్యేకమని కొనియాడారు. మన సంస్క్రుతిని రక్షించడంలో విశ్వకర్మల పాత్ర అనిర్వచనీయం అన్నారు.
సభలో ఓబిసి మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు రొంగల గోపీ క్రుష్ణ శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. రాష్ట్ర సంఘటనా ప్రధాన కార్యదర్శి మధుకర్ జీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు బిట్రశివన్నారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, బిజెపి మీడియా ఇంఛార్జి కిలారు దిలీప్, ఛీఫ్ స్పోక్స్ పర్సన్ వల్లూరు జయప్రకాష్, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత, గుంటూరు జిల్లా బిజెపి అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం, బాపట్ల జిల్లా అధ్యక్షుడు
బంగారు బాబు , ఆవుల నాగేంద్ర, పాండవ శర్మ, బిఎస్ఆర్ కె పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు.