logo

విజన్ బిల్డింగ్ పైన మూడు రోజుల శిక్షణ కార్యక్రమం.

నంద్యాల జిల్లా /పాణ్యం (AIMA MEDIA): పాణ్యం మండల మహిళా సమాఖ్య నందు సెప్టెంబర్ 17వ తేదీ బుధవారం గ్రామ సంఘం ప్రతినిధులకు విజన్ బిల్డింగ్ పైన మూడు రోజులు శిక్షణ కార్యక్రమాన్ని ఏరియా కోఆర్డినేటర్ ఎ.న్ ప్రసాద్ ఆధ్వర్యంలో నిర్వహించారు.అందులో భాగంగా మొదటి రోజు శిక్షణ కార్యక్రమానికి అన్ని గ్రామాల గ్రామ సంఘాల అధఈ శిక్షణ కార్యక్రమానికి శిక్షకులుగా జిల్లా ట్రైనర్లు అయినటువంటి కృష్ణమూర్తి,అంబమ్మ శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు.గ్రామాల్లో ఉన్నటువంటి మహిళల ఆరోగ్యం పైన,మహిళల ఆర్థిక అక్షరాస్యత పైన,ఆరోగ్యం మరియు విద్య పైన,వ్యవసాయ రంగాలపైన మహిళలు ఆర్థిక అభివృద్ధి సాధించడంలో ఏ విధంగా తమ యొక్క కుటుంబాలను సంఘాలను నడిపించుకోవాలని అటువంటి వాటిపైన శిక్షణ ఇవ్వడం జరిగినది. కార్యక్రమానికి హాజరైనటువంటి మహిళల ఉద్దేశించి నంద్యాల ఏరియా కోఆర్డినేటర్ AN ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి సంఘ సభ్యులు తమ నెలసరి సమావేశాల్లో ఈ విషయాలను చర్చించి సభ్యులందరికీ అవగాహన కల్పించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమానికి పుల్లయ్య ఏపీఎం, శ్రీనివాసులు ఏపీఎం, కాశీశ్వరుడు ఏపీఎం మరియు సీసీలు హాజరు అయ్యారు.

0
0 views