రైతు సేవ కేంద్రం ను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా వ్యవసాయ అధికారి.
నంద్యాల జిల్లా /దొర్నిపాడు (AIMA MEDIA ): దొర్నిపాడు మండలంలోని దొర్నిపాడు రైతు సేవా కేంద్రం ను జిల్లా వ్యవసాయ అధికారి శ్రీ మద్దిలేటి తనిఖీ చేశారు..తనిఖీల్లో భాగంగా ఈ పంట నమోదును పరిశీలించారు.ఈ పంట నమోదు త్వరితగతిన పూర్తి చేయాలని రైతు సేవా కేంద్ర సిబ్బందికి తెలియజేశారు.ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు సుధాకర్,మండల వ్యవసాయ అధికారి వి.ప్రమీల మరియు రైతు సేవ కేంద్ర సిబ్బంది పాల్గొన్నారు.