
శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాలలో రక్తదాన శిబిరం.
నంద్యాల జిల్లా/పాణ్యం (AIMA MEDIA): స్థానిక శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ మరియు శాంతిరాం మెడికల్ కాలేజ్ అండ్ జనరల్ హాస్పిటల్ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో ప్రధానమంత్రి గౌ. శ్రీ నరేంద్రమోదీ జన్మదిన సందర్బంగా రక్తదాన శిబిరం నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం వి సుబ్రహ్మణ్యం తెలిపారు. రక్తదానం అనేది ప్రాణాలను కాపాడే నిస్వార్థ చర్య దీనివల్ల అవసరమైన వారికి సమయానికి రక్తాన్ని అందచేయవచ్చన్నారు. రక్తదానం చేయడం వల్ల ఇతరుల ప్రాణాలను కాపాడటంతో పాటు, దాతల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతుందన్నారు. రక్తంలో ఇనుము స్థాయిని మరియు హృదయ సంబంధిత వ్యాధులను నియంత్రించడానికి రక్తదానము ఎంతో అవసరమని, యువతలో మానవతా విలువలు పెరుగుతాయని తెలియజేశారు. ప్రస్తుత దినాలలో కిడ్నీ డయాలసిస్, యాక్సిడెంట్స్ మరియు ఇతరత్రా వ్యాధుల ద్వారా బాధపడుతున్న వారికి మా కళాశాల తరపున రక్తదానం చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్ నాగరాజు, మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ డా. వసంత్ చవాన్, మెడికల్ ఆఫీసర్ డా. జానకి, బ్లడ్ బ్యాంక్ ఇంచార్జ్ సురేష్, వైద్య సిబ్బంది మరియు ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.