ఆటో డ్రైవర్ దారుణ హత్య - నిందితుల అరెస్ట్ - రిమాండ్
ఆటో డ్రైవర్ దారుణ హత్య - నిందితుల అరెస్ట్ - రిమాండ్జగిత్యాల జిల్లా జగిత్యాల గ్రామీణ మండలం పొలాస-గుల్లపేట సమీపంలోజగిత్యాలకు చెందిన నహిముద్ధీన్ అనే ఆటో డ్రైవర్ హత్య కేసులో మంగళ వారం పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. బీహర్‌కు చెందిన దర్శన్ సాహ్ని, సునీల్ సాహ్ని అనే కూలీలు మూడు వందలకు ఆటో అద్దెకు మాట్లాడుకొన్నారు.అద్దె విషయంలో గొడవ రావటంతో గుడ్డతో ఆటో డ్రైవర్ మెడకు ఉరి వేసి ఆ తర్వాత బండతో మోదీ హత్య చేసినట్లు జగిత్యాల డీఎస్పీ రఘు చందర్ తెలిపారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.