logo

జర్నలిస్టులపై అక్రమ కేసులు సహించం... * సాంబశివరావు పై పెట్టిన కేసులు ఎత్తివేయాలి

.
* ఆదిలాబాద్ లో నల్ల బ్యాడ్జీలు ధరించి టీయు డబ్లుజె నిరసన..
యూరియా కొరతపై రైతుల సమస్యలను కవరేజ్ చేస్తున్న ఖమ్మం ఉమ్మడి జిల్లా బ్యూరో ఇన్చార్జి సాంబశివరావు పై పోలీసులు పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని
టియుడబ్ల్యూజే ఆదిలాబాద్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది. సోమవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్ వద్ద జర్నలిస్టులు నల్ల బ్యాడ్జీలు ధరించి ఆందోళన చేపట్టారు. టీయూడబ్ల్యూజే యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు అల్లం నారాయణ పిలుపుమేరకు రాష్ట్రవ్యాప్త ఆందోళన కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు..ఖమ్మం జిల్లాలో రైతులు ఎదు ర్కొంటున్న యూరియా కొరత కు సంబంధించి కొనిజర్ల మండల కేంద్రంలో వార్త కవరేజ్ చేస్తున్న టీ న్యూస్ ఉమ్మ డి ఖమ్మం జిల్లాల బ్యూరో సాంబశివరా వు, వీడియో జర్నలిస్టు, టెక్నీషియన్ పై ఖమ్మం జిల్లా పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయడానికి ఆదిలాబాద్ జిల్లా జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ప్రభుత్వ తీరు కొనసాగుతున్నదని జర్నలిస్టులు ఆరోపించారు. ప్రభుత్వం రైతులకు సకాలంలో యూరియా అందించకపోవడంతో రైతులు పడుతున్న ఇబ్బందులను నేరుగా రైతులను అడిగి తెలుసుకుంటున్న విలేకరిపై అతిగా ప్రవర్తించడం అత్యంత హేయమైన చర్యగా పేర్కొన్నారు. ఇప్పటికైనా పోలీసులు సాంబశివరావు పై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, లేకపోతే దశలవారీగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు బేత రమేష్, ప్రధాన కార్యదర్శి రాజు, అదిలాబాద్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు ఏ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి దత్తాద్రి జర్నలిస్టులు , ప్రేమ్సాగర్, రఘు, మహేందర్ రెడ్డి,సుభాష్, రమేష్, సంతోష్, భూమేష్, కిరణ్, పవన్, శ్రీనివాస్, పిట్ల రాము, పాల్గొన్నారు. అనంతరం జర్నలిస్టులు కలిసి ఆర్డీవో స్రవంతికి వినతిపత్రం అందజేశారు

0
0 views